Canada : హిందువులకు కెనడా ప్రతిపక్ష నేత పియరీ పోయిలీవ్రే మద్ధతు

కెనడా దేశంలోని హిందువులకు కెనడా ప్రతిపక్ష నేత పియరీ పోయిలీవ్రే మద్ధతు ప్రకటించారు. భారతీయ సంతతికి చెందిన హిందువులను బెదిరించి, కెనడా విడిచిపెట్టాలని సిక్కుల ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ వైరల్ వీడియోలో కోరిన నేపథ్యంలో ఆయన ద్వేషపూరితమైన వ్యాఖ్యలను కన్జర్వేటివ్ నాయకుడు పొయిలీవ్రే ఖండించారు....

Canada : హిందువులకు కెనడా ప్రతిపక్ష నేత పియరీ పోయిలీవ్రే మద్ధతు

Pierre Poilievre

Updated On : September 23, 2023 / 8:08 AM IST

Canada : కెనడా దేశంలోని హిందువులకు కెనడా ప్రతిపక్ష నేత పియరీ పోయిలీవ్రే మద్ధతు ప్రకటించారు. భారతీయ సంతతికి చెందిన హిందువులను బెదిరించి, కెనడా విడిచిపెట్టాలని సిక్కుల ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ వైరల్ వీడియోలో కోరిన నేపథ్యంలో ఆయన ద్వేషపూరితమైన వ్యాఖ్యలను కన్జర్వేటివ్ నాయకుడు పొయిలీవ్రే ఖండించారు.

Vande Bharat Express : రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మోదీ పచ్చజెండా

కెనడాలో హిందువులు అమూల్యమైన సహకారం అందించారని పియరీ పోయిలీవ్రే పేర్కొన్నారు. (Canada’s Opposition Leader Supports Hindu Community) ప్రతి కెనడియన్ దేశంలో భయం లేకుండా జీవించడానికి అర్హుడని కన్జర్వేటివ్ నాయకుడు పొయిలీవ్రే అన్నారు. ‘‘ప్రతి కెనడియన్ భయం లేకుండా జీవించడానికి అర్హులు. ఇటీవల కెనడాలో హిందువులను లక్ష్యంగా చేసుకుని ద్వేషపూరిత వ్యాఖ్యలను మేం చూశాం. సంప్రదాయవాదులతో సహా నేను ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నాను’’ అని ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు.

IMD Issues Yellow Alert : పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు…ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ

హర్‌దీప్ సింగ్ నిజ్జర్‌ను కాల్చిచంపడం వెనుక భారత ప్రభుత్వ హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన నేపథ్యంలో భారత్-కెనడా సంబంధాల్లో ఏర్పడిన ఉద్రిక్తతల మధ్య పొయిలీవ్రే ట్వీట్ చేశారు. సిక్కు ఉగ్రవాది నిజ్జర్ ను జూన్ 18వతేదీన కెనడాలోని సర్రేలో కాల్చి చంపారు. భారత పౌరులు, కెనడాలోని విద్యార్థులు, ఆ దేశానికి వెళ్లాలనుకునే వారు జాగ్రత్తగా ఉండాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది.

UK PM Rishi Sunak : యూకేలో త్వరలో సిగరెట్లపై నిషేధాస్త్రం…ప్రధాని రిషి సునక్ యోచన

కెనడా చర్యతో కెనడాకు చెందిన సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరిస్తూ భారతదేశం బహిష్కరించింది. కెనడా ప్రతిపక్ష నాయకుడు పియరీ పోయిలీవ్రే మంగళవారం మాట్లాడుతూ తీర్పులు ఇవ్వడానికి ట్రూడో అన్ని వాస్తవాలతో బయటకు రావాలని అన్నారు. 2025లో జరిగే తదుపరి ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కన్జర్వేటివ్‌లకు మెజారిటీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం.