Vande Bharat Express : రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మోదీ పచ్చజెండా

తిరునెల్వేలి-చెన్నై,కాచిగూడ- బెంగళూరు వందేభారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ సెప్టెంబర్ 24వతేదీన పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. తిరునెల్వేలి-చెన్నై ఎగ్మోర్ స్టేషన్ల మధ్య నడిచే రెండో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ట్రయల్ రన్‌ను దక్షిణ రైల్వే విజయవంతంగా నిర్వహించింది....

Vande Bharat Express : రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మోదీ పచ్చజెండా

Vande Bharat Express

Updated On : September 23, 2023 / 6:56 AM IST

Vande Bharat Express : తిరునెల్వేలి-చెన్నై,కాచిగూడ- బెంగళూరు వందేభారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ సెప్టెంబర్ 24వతేదీన పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. తిరునెల్వేలి-చెన్నై ఎగ్మోర్ స్టేషన్ల మధ్య నడిచే రెండో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ట్రయల్ రన్‌ను దక్షిణ రైల్వే విజయవంతంగా నిర్వహించింది. సెప్టెంబర్ 24వతేదీన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సెమీ హైస్పీడ్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. (Vande Bharat Express) చెన్నై-కోయంబత్తూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తర్వాత తమిళనాడులోని ప్రయాణికులకు సేవలు అందించే రెండవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇది.

IMD Issues Yellow Alert : పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు…ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ

ట్రయల్ రన్ కోసం వందేభారత్ రైలు తిరునల్వేలి జంక్షన్ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.30- 1.45 గంటల మధ్య చెన్నా ఎగ్మోర్ స్టేషన్‌కు చేరుకుంది. ఈ రైలు తిరుచ్చిలో ఐదు నిమిషాలు ఆగింది. ఎనిమిది బోగీల ఈ రైలులో సీటింగ్ సామర్థ్యం 530. ఇందులో ఐదు ఏసీ చైర్ కార్ కోచ్‌లు, ఒక ఏసీ ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఉందని రైల్వే అధికారులు చెప్పారు. ఈ రైలు గంటకు 83.30 కి.మీ వేగంతో నడుస్తుంది. తమిళనాడులోని దక్షిణ జిల్లాలను రాజధాని చెన్నైతో కలుపుతుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

UK PM Rishi Sunak : యూకేలో త్వరలో సిగరెట్లపై నిషేధాస్త్రం…ప్రధాని రిషి సునక్ యోచన

మంగళవారం మినహా మిగిలిన రోజుల్లో ఈ రైలు నడుస్తుందని రైల్వేఅధికారులు వివరించారు. దీంతోపాటటు కాచిగూడ- బెంగళూరు మూడో వందేభారత్ రైలును కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 24వతేదీన ప్రారంభించనున్నారు. సెప్టెంబరు 24వతేదీ మధ్యాహ్నం 12 గంటలకు కాచిగూడ- బెంగళూరు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని మోదీ పచ్చజెండా ఊపనున్నారు. కాచిగూడ-బెంగళూరు వందేభారత్ రైలు బుధవారం మినహా మిగతా రోజుల్లో నడవనుంది.

Delhi CM Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత వాట్సాప్ ఛానల్‌ ప్రారంభం

కాచిగూడలో తెల్లవారుజామున 5.30గంటలకు బయలుదేరి మహబూబ్ నగర్ కు 6.59 గంటలకు, కర్నూలుకు 8.30 గంటలకు, అనంతపురానికి 10.54 గంటలకు, యశ్వంత్ పూర్ కు మధ్యాహ్నం 2.15 గంటలకు చేరుకుంటుంది. మళ్లీ మధ్యాహ్నం 3 గంటలకు యశ్వంత్ పూర్ నుంచి బయలుదేరి కాచిగూడకు రాత్రి 11.15 గంటలకు చేరుకోనుందని రైల్వే అధికారులు చెప్పారు. ఈ రైలుతో ప్రయాణ సమయం 3 గంటలు తగ్గనుంది.