కోవిడ్ – 19 (కరోనా) ఎఫెక్ట్ : పిల్లులు, కుక్కలకు మాస్కులు

  • Published By: madhu ,Published On : February 17, 2020 / 08:19 AM IST
కోవిడ్ – 19 (కరోనా) ఎఫెక్ట్ : పిల్లులు, కుక్కలకు మాస్కులు

Updated On : February 17, 2020 / 8:19 AM IST

చైనా దేశాన్ని కోవిడ్ – 19 కబళించి వేస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది మృతి చెందుతున్నారు. వేలాది సంఖ్యలో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌పై తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. వైరస్ బారిన పడుకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వం సూచనలు చేస్తోంది. అయితే..వైరస్‌ను వ్యాక్సిన్ మాత్రం కనిపెట్టలేక శాస్త్రవేత్తలు, వైద్యులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు 17 వందల 75 మంది మృత్యువాత పడడం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

చాలా మంది ఇంటి నుంచి బయటకు రావడం లేదు. దీనితో చైనాలోని ప్రధాన నగరాలన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ప్రధానంగా వూహాన్ నగరం నిశబ్ధం తాండవిస్తోంది. కానీ వైరస్‌ ఎలా వ్యాపిస్తుందో అంతుపట్టడం లేదు. దీనిపై విభన్న రకాల ప్రచారం జరుగుతోంది. జంతువుల నుంచి వస్తుందని, మాంసాహారం తినడం వల్ల వస్తుందని ఎన్నో రకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు మాస్కులు ధరిస్తున్నారు. దీంతో మాస్కులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. 

ఇదిలా ఉంటే…జంతువులకు మాస్కులు వేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. పెంపుడు పిల్లులు, కుక్కలకు మాస్కులు వేస్తున్నారు. దీనివల్ల మాస్కుల కొరత తీవ్రంగా ఏర్పడుతోంది. మనుషులు ధరించే మాస్కులకు రంధ్రాలు చేసి జంతువులకు తొడుగుతుండడం విశేషం. కానీ పెంపుడు పిల్లులు, కుక్కల నుంచి వైరస్ వ్యాపిస్తుందనడానికి ఖచ్చితమైన ఆధారం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడిస్తోంది. అయితే..జంతువులను ముట్టుకున్న తర్వాత మాత్రం..చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తోంది. దీనివల్ల బ్యాక్టీరియాలను చాలా మటుకు అరికట్టవచ్చని వెల్లడించింది. 

Read More : మైండ్ సెట్ మారాలి : ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్ హోదా ఇవ్వాలి – సుప్రీం