Trump’s India visit: 2020లో డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందంటే..?

అమెరికా అధ్యక్షుడి హోదాలో 2020లో డొనాల్డ్ ట్రంప్ భారత్ లో పర్యటించిన సమయంలో అందుకోసం కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.38 లక్షలు ఖర్చుపెట్టిందని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా తెలిసింది. మొత్తం 36 గంటల ట్రంప్ పర్యటనకు గాను కేంద్ర ప్రభుత్వం ఈ ఖర్చు చేసింది. ట్రంప్ వసతి, ఆహారం, ఇతర అవసరాలకు ఈ డబ్బును వాడింది. 2020 ఫిబ్రవరి 24-25న ట్రంప్ తన భార్య మెలానియా, కూతురు ఇవాంకా, అల్లుడు జరేడ్ కుష్నర్, పలువులు అమెరికా అధికారులు అహ్మదాబాద్, ఢిల్లీలో పర్యటించారు.

Trump’s India visit: 2020లో డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందంటే..?

Trump's India visit

Updated On : August 18, 2022 / 11:53 AM IST

Donald Trump’s India visit: అమెరికా అధ్యక్షుడి హోదాలో 2020లో డొనాల్డ్ ట్రంప్ భారత్ లో పర్యటించిన సమయంలో అందుకోసం కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.38 లక్షలు ఖర్చుపెట్టిందని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా తెలిసింది. మొత్తం 36 గంటల ట్రంప్ పర్యటనకు గాను కేంద్ర ప్రభుత్వం ఈ ఖర్చు చేసింది. ట్రంప్ వసతి, ఆహారం, ఇతర అవసరాలకు ఈ డబ్బును వాడింది. 2020 ఫిబ్రవరి 24-25న ట్రంప్ తన భార్య మెలానియా, కూతురు ఇవాంకా, అల్లుడు జరేడ్ కుష్నర్, పలువులు అమెరికా అధికారులు అహ్మదాబాద్, ఢిల్లీలో పర్యటించారు.

ఫిబ్రవరి 24న ట్రంప్ అహ్మదాబాద్ లో మూడు గంటలు గడిపారు. అక్కడి నుంచి ట్రంప్ ఆగ్రాకు వెళ్ళి తాజ్ మహల్ ను చూశారు. ఫిబ్రవరి 25న ఢిల్లీలో పర్యటించారు. అదే రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరిపారు. భారత పర్యటనలో ఉన్న ట్రంప్ కోసం కేంద్ర సర్కారు ఎంత ఖర్చు చేసిందన్న విషయంపై ఆర్టీఐ ద్వారా మిషాల్ భతేనా అనే వ్యక్తి వివరాలు అడగగా అందుకు కేంద్ర విదేశాంగ శాఖ సమాధానం ఇచ్చింది.

మిషాల్ భతేనా మొదట 2020, అక్టోబరు 24న మొదట ఆర్టీఐ దరఖాస్తు ద్వారా వివరాలు అడగగా సమాధానం రాలేదు. దీంతో సమాచార కమిషన్ ను ఆశ్రయించారు. కరోనా వల్ల సమాచారం ఇవ్వడంలో ఆలస్యమైందని కేంద్ర సర్కారు చెప్పింది. చివరకు ఇప్పుడు ఆ వివరాలు ఇచ్చింది.

China-Taiwan conflict: తైవాన్ విషయంలో మరో నిర్ణయం తీసుకుని చైనాకు అసహనం తెప్పించిన అమెరికా