Chandrayaan-3 : విక్రమ్ ల్యాండర్ ఫొటోలను తీసిన లూనార్ ఆర్బిటర్
చంద్రుడి ఉపరితలంపై ఉన్న విక్రమ్ ల్యాండర్ ను లూనార్ ఆర్బిటర్ గుర్తించడం దక్షిణ కొరియా అంతరిక్ష కార్యక్రమానికి ఒక అతి పెద్ద విజయం.

Lunar Orbiter
Chandrayaan-3 Vikram Lander : దక్షిణ కొరియాకు చెందిన లూనార్ ఆర్బిటర్ దనూరి ఇటీవల చంద్రుడి ఉపరితలంపై దిగిన చంద్రయాన్ 3 మిషన్ లోని విక్రమ్ ల్యాండర్ ను చిత్రాన్ని తీసింది. శివశక్తి పాయింట్ లో ఉన్న ల్యాండర్ ఫొటోలు కనిపిస్తున్నాయి. చంద్రుడి ఉపరితలంపై ఉన్న విక్రమ్ ల్యాండర్ ను లూనార్ ఆర్బిటర్ గుర్తించడం దక్షిణ కొరియా అంతరిక్ష కార్యక్రమానికి ఒక అతి పెద్ద విజయం.
దక్షిణ కొరియా ఆర్టిటర్ మిషన్ అక్టోబర్ 2022లో ప్రారంభమైంది. ఆర్బిటర్ లో హై రిజల్యూషన్ కెమెరా, స్పెక్ట్రో మీటర్, మ్యాగ్నోటో మీటర్ ఉన్నాయి. ఇందులో రోవర్ సైతం ఉంది. రానున్న రోజుల్లో చంద్రుడి ఉపరితలంపై దింపేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం లూనార్ ఆర్బిటర్ చంద్రుడి కక్ష్యలో తిరుగుతూ చంద్రుడి ఉపరితలంపై కన్నేసి ఉంచింది. ఈ ఆర్బిటర్ తన కెమెరాతో ల్యాండర్ విక్రమ్ ను గుర్తించి ఆ చిత్రాలను తీసి పంపింది.
Chandrayaan-3: చంద్రయాన్-3 ల్యాండర్ కొత్త ఫొటోలు పోస్ట్ చేసిన ఇస్రో
దక్షిణ కొరియా సైతం చంద్రుడిపై పరిశోధనలు చేస్తోంది. దక్షిణ కొరియా 2023 నాటికి మానవుడిని చంద్రుడిపైకి పంపాలని యోచిస్తోంది. ఇదిలావుంటే భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్టులో భాగంగా ఆగస్టు 23న విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా దక్షిణ ధృవంపై ల్యాండ్ అయింది. చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగు పెట్టిన తొలి దేశంగా, చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయిన నాలుగో దేశంగా నిలిచింది.