China Covid variant BF.7 : కోవిడ్ జెట్ స్పీడ్ .. చైనాలో 20 రోజుల్లో 25 కోట్ల మందికి వైరస్
మూడేళ్లకుపైగా కోవిడ్ ఆంక్షల్లోనే జీవిస్తున్న చైనా ప్రజలు లాక్ డౌన్లతో విసిగిపోయి ‘ప్రభుత్వం చేపట్టిన జీరో కోవిడ్ విధానం’పై తీవ్రంగా తిరగబడ్డారు. దీంతో ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలు ఎత్తివేసినదానికి ఫలితంగా చైనా అంతా కోవిడ్ మహమ్మారి ప్రతాపానికి విలవిల్లాడిపోతోంది. ఊహించినదాని కంటే వేగంగా కోవిడ్ కొత్త వేరియంట్ వ్యాపిస్తోంది.కేవలం 20 రోజుల్లోనే 25కోట్లమందికి వ్యాపించింది..

China Covid variant BF.7
China Covid variant BF.7 : మూడేళ్లకుపైగా కోవిడ్ ఆంక్షల్లోనే జీవిస్తున్న చైనా ప్రజలు లాక్ డౌన్లతో విసిగిపోయి ‘ప్రభుత్వం చేపట్టిన జీరో కోవిడ్ విధానం’పై తీవ్రంగా తిరగబడ్డారు. దీంతో ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలు ఎత్తివేసినదానికి ఫలితంగా చైనా అంతా కోవిడ్ మహమ్మారి ప్రతాపానికి విలవిల్లాడిపోతోంది. ఊహించినదాని కంటే వేగంగా కోవిడ్ వ్యాపిస్తోంది. ఈ తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే కేవలం 20 రోజుల్లోనే 25కోట్లమందికి వ్యాపించేంతగా..!!
జీరో పాలసీ విధానం ఎత్తివేశాక కోవిడ్ ఇక చూస్కోండి నా ప్రతాపం అంటోంది చైనాలో. ఒక్కరోజే లక్షల కేసులు నమోదు అవుతున్నాయి. దీంట్లో భాగంగా డిసెంబరు 1 నుంచి 20 వరకు చూసుకుంటే 24.8 కోట్లమంది ప్రజలు కోవిడ్ వైరస్ బారిన పడ్డారు.అంటే కేవలం 20 రోజుల్లో దాదాపు 25 కోట్ల మందికి వైరస్ సోకింది. చైనా నేషనల్ హెల్త్ కమిషన్ (ఎన్‌హెచ్‌సీ) సమావేశంలో ఈ విషయం బటయపడింది అధికారికంగా. చైనా జనాభాలో 17.65 శాతం మంది వైరస్ బారిన పడినట్లుగా ఓ పత్రం లీకేజీలో వెల్లడైంది. రోజువారీ కోవిడ్ డేటాను ప్రచురించకూడదని ఎన్‌హెచ్‌సీ (చైనా జాతీయ ఆరోగ్యకమిషన్) నిర్ణయించింది.
ఎన్‌హెచ్‌సీ సమావేశ వివరాలున్న నోట్ ఒకటి లీక్ అవ్వటంతో ఈ విషయం తెలిసింది. కోవిడ్ తీవ్రతను బట్టి 2023లో 20 లక్షల మంది కోవిడ్ మరణాలను నిపుణులు అంచనా వేశారు. కానీ నిపుణులు అంచనావేసినదాని కంటే ఎక్కువగా వ్యాపిస్తోంది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు వ్యాపిస్తుండటంతో చైనాలోని ఆసుపత్రులు మరియు మృతదేహాలు పూర్తిగా నిండిపోయాయి. కేసుల తీవ్రత అంతకంతకు పెరుగుతుంటంతో కోవిడ్ వ్యాప్తిని అరకట్టలేపోతోంది చైనా. ప్రస్తుత కోవిడ్ ఉవ్వెన ఎగసిపడుతూన్న క్రమంలో BF.7 వేరియంట్ అత్యంత వాయువేగంతో వ్యాప్తిచెందుతోంది. ఇది దేశానికి అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తోంది. పెద్ద నగరాల్లో వ్యాపిస్తున్న అంటువ్యాధులు సునామీని తలపిస్తున్నాయి. కోవిడ్ నుంచి చైనా దేశం బయటపడటానికి కొన్ని నెలలే పట్టవచ్చంటున్నారు నిపుణులు.
బీజింగ్, సిచువాన్‌లలో దాదాపు సగం మందికి కొవిడ్ సోకిందని అంచనా. ఇలా కోవిడ్ వ్యాప్తి విషయం విషయం చైనా సోషల్ మీడియాల్లో ప్రచారం కావడంతో అధికారులు దానిని తొలగించారు. ఆదివారం (డిసెంబర్ 25,2022)నుంచి చైనాలో కొవిడ్ కేసుల సంఖ్యను అధికారికంగా ప్రకటించబోమని ఎన్‌హెచ్‌ఎస్ పేర్కొంది.