China Good News Indian Students : భారతీయ విద్యార్థులకు చైనా గుడ్‌న్యూస్..వీసా పునరుద్ధరణ
కరోనా ఆంక్షలతో గత రెండేళ్లుగా స్వదేశంలో ఉంటున్న వేలాది మంది భారతీయ విద్యార్థులకు చైనా గుడ్‌న్యూస్ చెప్పింది. విద్యార్థులు తమ చదువులు కొనసాగించేందుకు వీలుగా... వీసా జారీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ప్రకటించింది. విద్యార్థుల వీసాలతోపాటు పర్యాటకం, బిజినెస్ వీసాలను కూడా ఇవ్వనున్నట్టు తెలిపింది.

China good news for Indian students
China Good News Indian Students : కరోనా ఆంక్షలతో గత రెండేళ్లుగా స్వదేశంలో ఉంటున్న వేలాది మంది భారతీయ విద్యార్థులకు చైనా గుడ్‌న్యూస్ చెప్పింది. విద్యార్థులు తమ చదువులు కొనసాగించేందుకు వీలుగా… వీసా జారీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ప్రకటించింది. విద్యార్థుల వీసాలతోపాటు పర్యాటకం, బిజినెస్ వీసాలను కూడా ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ మేరకు చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, ఆసియా వ్యవహారాల శాఖ కౌన్సెలర్ జిరాంగ్ ట్వీట్ చేశారు.
విద్యార్థులు, వ్యాపారవేత్తలు, చైనాలో పనిచేస్తున్న కుటుంబాలకు సంబంధించి వీసాలు జారీ చేయనున్నట్లు న్యూఢిల్లీలోని చైనా ఎంబసీ విడుదల చేసిన ప్రకటనను ఆమె షేర్ చేశారు. ఈ ప్రకటనతో మధ్యలోనే ఆగిన తమ చదువులను కొనసాగించేదుకు, కొత్తగా ఉన్నత చదువుల కోసం చైనాకు వెళ్లాలనుకునేవారికి X1 వీసాలను జారీ చేయనున్నారు.
China : విజయవంతంగా 90రోజుల అంతరిక్ష యాత్ర..భూమికి తిరిగొచ్చిన చైనా వ్యోమగాములు..
కరోనా విజృంభణతో రెండేళ్లుగా చైనాలో కఠిన కొవిడ్ నిబంధనలు అమలు చేశారు. దీంతో భారతీయ విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నారు. వైరస్ విజృంభణ, ఇతర ఆంక్షలతో చైనా వీసాలను రద్దు చేసింది. దీంతో దాదాపు 23 వేల మంది భారతీయ విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. వీరిలో ఎక్కువ మంది వైద్యవిద్యను అభ్యసిస్తున్నవారే ఉన్నారు. ఎట్టకేలకు వీసా పునరుద్ధరణ కార్యక్రమం చేపడుతుండడంతో భారత విద్యార్థులకు ఉపశమనం కలగనుంది.