China Lockdown: చైనాను వదలని కరోనా.. భారీగా పెరిగిన కొవిడ్ -19 కేసులు.. మళ్లీ లాక్‌డౌన్ షురూ..

చైనాను కరోనా మహమ్మారి వీడటం లేదు. ఆ దేశంలోని పలు నగరాల్లో మళ్లీ లాక్‌డౌన్ షురూ అయింది. అక్టోబర్ తొలివారంలో జాతీయ సెలవుల దినాల్లో ఆ దేశ ప్రజలు కొవిడ్ ఆంక్షలను పక్కనపెట్టి బహిరంగ ప్రదేశాల్లో విస్తృతంగా ప్రయాణాలు సాగించారు. దీంతో కొవిడ్-19 కేసులు సంఖ్య మూడు రెట్లు పెరిగినట్లు అధికారులు గుర్తించి ఆయా నగరాల్లో లాక్ డౌన్ ఆంక్షలు అమల్లోకి తెచ్చారు.

China Lockdown: చైనాను వదలని కరోనా.. భారీగా పెరిగిన కొవిడ్ -19 కేసులు.. మళ్లీ లాక్‌డౌన్ షురూ..

lock down in china

Updated On : October 11, 2022 / 7:30 AM IST

China Lockdown: కరోనా వైరస్ నుంచి ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కుదటపడుతున్నాయి. వైరస్ వ్యాప్తితగ్గడంతో దాదాపు అన్ని దేశాల్లో లాక్‌డౌన్ ఆంక్షలను ఎత్తివేశారు. కానీ, చైనాను మాత్రం కొవిడ్ వీడటం లేదు. ఆ దేశంలోని పలు నగరాల్లో మళ్లీ లాక్‌డౌన్ షురూ అయింది. అక్టోబర్ తొలివారంలో జాతీయ సెలవులు దినాలను ఆ దేశ ప్రజలు ఎంజాయ్ చేశారు. కొవిడ్ ఆంక్షలను పక్కనపెట్టారు. దీంతో కొవిడ్-19 కేసులు సంఖ్య మూడు రెట్లు పెరిగినట్లు అధికారులు గుర్తించారు. దీనికితోడు వచ్చేవారం బీజింగ్‌లో ప్రధాన కమ్యూనిస్టు పార్టీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తుగానే సోమవారం నుంచి చైనాలోని ప్రధాన నగరాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. సనిమా థియేటర్లు, ఇతర వినోద కార్యక్రమాలను అధికారులు నిలిపివేశారు.

Indian Immunologicals : మరో భారీ పెట్టుబడిని ఆకర్షించిన తెలంగాణ.. రూ.700 కోట్లతో వ్యాక్సిన్ తయారీ యూనిట్

ఉత్తర చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌లోని ఫెన్వాంగ్ నగరంలో గతంకంటే కొవిడ్ పాజిటివ్ కేసులు పెరిగినట్లు పరీక్షల్లో తేలడంతో సోమవారం నుంచి ఆ ప్రాంతంలో లాక్‌డౌన్ ఆంక్షలను అధికారులు అమల్లోకి తెచ్చారు. అదేవిధంగా షాంగ్సీ ప్రావిన్స్‌కు సమీపంలోని ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో, రాజధాని హోహోట్ ప్రాంతంలో మంగళవారం నుంచి బయటి వాహనాలు, ప్రయాణీకులు నగరంలోకి ప్రవేశాన్ని నిషేధించారు. హోహోట్ ప్రాంతంలో సుమారు గడిచిన పన్నెండు రోజుల్లో 2వేల కంటే ఎక్కువగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఐదేళ్లకు ఒకసారి జరిగే కమ్యూనిస్టు పార్టీ స‌మావేశాల‌పై కొవిడ్ ప్ర‌భావం ప‌డ‌కుండా ఉండేందుకు ముందుగానే ప‌లు న‌గ‌రాల్లో లాక్‌డౌన్‌లు అమ‌లు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. జీరో కోవిడ్ పాల‌సీలో భాగంగా ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటున్న‌ట్లు అధికారులు చెబుతున్నారు.