Indian Immunologicals : మరో భారీ పెట్టుబడిని ఆకర్షించిన తెలంగాణ.. రూ.700 కోట్లతో వ్యాక్సిన్ తయారీ యూనిట్

పెట్టుబడుల ఆకర్షణలో దూసుకుపోతున్న తెలంగాణ.. మరో భారీ పెట్టుబడిని సాధించింది. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో రూ.700 కోట్ల పెట్టుబడితో జంతువుల వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఇండియ‌న్ ఇమ్యూనోలాజిక‌ల్స్ లిమిటెడ్ (ఐఐఎల్‌) ముందుకు వ‌చ్చింది.

Indian Immunologicals : మరో భారీ పెట్టుబడిని ఆకర్షించిన తెలంగాణ.. రూ.700 కోట్లతో వ్యాక్సిన్ తయారీ యూనిట్

Indian Immunologicals : పెట్టుబడుల ఆకర్షణలో దూసుకుపోతున్న తెలంగాణ.. మరో భారీ పెట్టుబడిని సాధించింది. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో రూ.700 కోట్ల పెట్టుబడితో జంతువుల వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఇండియ‌న్ ఇమ్యూనోలాజిక‌ల్స్ లిమిటెడ్ (ఐఐఎల్‌) ముందుకు వ‌చ్చింది.

పశువులకు వచ్చే ఫుడ్ అండ్ మౌత్ డిసీజ్ తో పాటుగా ఇతర వ్యాధులకు సంబంధించిన టీకాలను ఈ కేంద్రంలో ఉత్పత్తి చేయనున్నారు. ఐఐఎల్ ఎండీ డాక్టర్ ఆనంద్ కుమార్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లు ముకుల్ గౌడ్, భార్గవ్ లతో పాటు సంస్థ ఇతర అధికారులు మంత్రి కేటీఆర్ తో సమావేశం అయ్యారు. తమ సంస్థ విస్తరణ ప్రణాళికలను వివరించారు.

జాతీయ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డు అనుబంధ సంస్థ అయిన ఇండియ‌న్ ఇమ్యూనోలాజిక‌ల్స్ లిమిటెడ్ ప్రపంచంలోని అతిపెద్ద ఎఫ్ఎండీ వ్యాక్సిన్ తయారీదారుల్లో ఒకటి. భారత ప్రభుత్వ నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఎఫ్ఎండీ వ్యాక్సిన్ ను అందించే సప్లయర్ కూడా.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఇప్పటికే గచ్చిబౌలిలో ఐఐఎల్ కు ఓ యూనిట్ కూడా ఉంది. ఈ యూనిట్ ద్వారా ఏడాదికి 300 మిలియన్ వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేస్తోంది. కొత్తగా జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేయబోతున్న మరో యూనిట్ తో ఏడాదికి అదనంగా 300 మిలియన్ డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి అవనుంది. కొత్తగా ఏర్పాటు అవనున్న కేంద్రం ద్వారా 750 మందికిపైగా ఉపాధి లభించనుందన్నారు మంత్రి కేటీఆర్. ఇప్ప‌టికే వ్యాక్సిన్ కేపిట‌ల్ ఆఫ్ వ‌రల్డ్‌గా ప్ర‌సిద్ధి చెందిన హైద‌రాబాద్‌లో.. ఐఐఎల్ మ‌రో వాక్సిన్ యూనిట్‌ను ఏర్పాటు చేయ‌నుండ‌డం హర్షణీయమని కేటీఆర్ చెప్పారు.