చైనా యుద్ధ విమానాన్ని కూల్చేసిన తైవాన్!

  • Published By: venkaiahnaidu ,Published On : September 4, 2020 / 10:07 PM IST
చైనా యుద్ధ విమానాన్ని కూల్చేసిన తైవాన్!

Updated On : September 5, 2020 / 6:31 AM IST

ఇప్పటికే భారత సరిహద్దులో తరచూ నిబంధనలు ఉల్లంఘిస్తున్న డ్రాగన్ కంట్రీ తాజాగా తైవాన్‌ పై కన్నేసినట్లు కనిపించింది. చైనాకు చెందిన సుఖోయ్ -35 యుద్ధ విమానాలు తైవాన్ గగనతలంలోకి అక్రమంగా చొరబడటంతో తైవాన్ ధీటుగా సమాధానం ఇచ్చినట్లు తైవాన్ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

చైనాకు చెందిన సుఖోస్ సు – 35 ఫైటర్ జెట్‌ను తైవాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూల్చేసినట్టు తైవాన్ సోషల్ మీడియా కోడై కూస్తోంది. దక్షిణ చైనా నుంచి తైవాన్ గగనతలంలోకి వెళ్లడానికి ప్రయత్నించిన చైనీస్ యుద్ధ విమానాన్ని కూల్చేశారని, అది గాంగ్‌ క్సీ (దక్షిణ చైనాలో స్వయం ప్రతిపత్తి గల ఓ భాగం) అనే ప్రాంతంలో కూలినట్టు ది జ్యుయిష్ ప్రెస్ కథనంలో పేర్కొంది. ఓ జెట్ కూలి, పెద్ద ఎత్తున పొగ వ్యాపించిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు పోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్నాయి.

అయితే, ఆ వీడియో ఎక్కడిది అనే విషయం స్పష్టంగా తెలియలేదు. కానీ, తైవాన్ సోషల్ మీడియాలో మాత్రం….. తైవాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం.. చైనీస్ సుఖోయ్ సు – 35 ఫైటర్ జెట్ ‌ను కూల్చినట్లు ప్రచారం జరుగుతోంది. . కానీ, దీనిని చైనా ప్రభుత్వం ధ్రువీకరించలేదు. సోషల్ మీడియాలో మాత్రం తైవాన్ మిలటరీ వర్గాలే కూల్చాయని ప్రచారం జరుగుతున్నప్పటికీ… సాంకేతిక లోపంతో యుద్ధ విమానం ఏమైనా కూలిందా అన్న కోణంలో కూడా చర్చ జరుగుతోంది

కాగా, తైవాన్ సరిహద్దు ప్రాంతాల్లో మిలటరీ మిషన్ నిర్వహిస్తామంటూ గత నెలలో చైనా ప్రకటించింది. అయితే, అలాంటి చర్యలకు దిగితే తగిన సమాధానం చెబుతామని తైవాన్ కూడా హెచ్చరించింది. గత ప్రకటనల నేపథ్యంలో చైనీస్ సుఖోయ్ జెట్ కూలడంతో అది తైవాన్ కూల్చినట్టు నెటిజన్లు భావిస్తున్నారు.