China Conspiracy : భారత్ ఎన్నికల్లో అవాంతరాలు సృష్టించేందుకు చైనా కుట్రలు? కేంద్రాన్ని హెచ్చరించిన మైక్రోసాఫ్ట్
భారత్ ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ ఆందోళన వ్యక్తం చేసింది.

China Conspiracy On India
China Conspiracy : భారత్ లో ఎన్నికల వేళ మైక్రోసాఫ్ట్ కీలక ప్రకటన చేసింది. ఎన్నికల్లో చైనా అవాంతరాలు సృష్టించే అవకాశం ఉందని హెచ్చరించింది. భారత్ సహా అమెరికా, దక్షిణ కొరియా ఎన్నికల ప్రక్రియలో కూడా జోక్యం చేసుకునేందుకు డ్రాగన్ కంట్రీ ప్లాన్ చేస్తోందని ఆరోపించింది. అందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ని అస్త్రంగా చేసుకోనుందని తెలిపింది టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్.
ఇప్పటికే ఇండియా ఎలక్షన్ దంగల్ హీట్ ఎక్కిస్తోంది. సార్వత్రిక సమరంలో పార్టీలు దూకుడు మీదున్నాయి. ఒకవైపు ప్రచారాలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తూనే మరోవైపు సోషల్ మీడియా క్యాంపెయిన్ ను జోరుగానే చేస్తున్నాయి. అన్ని పార్టీలకు సోషల్ మీడియా వింగ్ లు ఉంటే.. కొన్ని పార్టీలు అడ్వాన్స్డ్ గా ఏఐ ని వాడుతున్నాయి. ప్రధాని మోదీతో పాటు పలువురు ఏఐ టూల్ ని వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో సందట్లో సడేమియాలా చైనా జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ ఆందోళన వ్యక్తం చేసింది.
భారత్ లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నాయని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చైనా భారత్ లోక్ సభ ఎన్నికలపై ప్రభావం చూపే ఛాన్స్ ఉందని తెలిపింది. ఏఐ కంటెంట్ తో దక్షిణ కొరియా, అమెరికా దేశాల ఎన్నికలపైన కూడా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని మైక్రోసాఫ్ట్ అలర్ట్ చేసింది. మైక్రోసాఫ్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ టీమ్ ప్రకారం చైనా ప్రభుత్వం మద్దతు ఉన్న సైబర్ గ్రూపులు ఈ ఏడాది జరగనున్న పలు దేశాల ఎన్నికలను ప్రభావం చేయనున్నాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేందుకు సోషల్ మీడియా వేదికగా ఏఐ జనరేటేడ్ కంటెంట్ ను డ్రాగన్ కంట్రీ వాడనుందని మైక్రోసాఫ్ట్ టీమ్ తెలిపింది.
డీప్ ఫేక్, మీమ్స్ తో జనాలను మిస్ గైడ్ చేసే ఛాన్స్ ఉందని వార్నింగ్ ఇచ్చింది. ఏఐ కంటెంట్ తో భారత ఎన్నికల ప్రక్రియలో అవాంతరం సృష్టించేందుకు డ్రాగన్ కంట్రీ కుట్రలు చేస్తున్నట్లు అలర్ట్ చేసింది. పలు దేశాల ఎన్నికల్లో చైనా తప్పుడు ఏఐ కంటెంట్ వాడినట్లు వెల్లడించింది.
Also Read : భారత్ నుంచి వచ్చే చీరలు, మసాలాలు వాడొద్దు..! భారత్‌పై విషం చిమ్ముతున్న బంగ్లాదేశ్.. ఎందుకిలా?