China : నిద్రపోయే డ్రైవర్ల కోసం హైవేలపై లేజర్ లైట్లు.. అక్కడి అధికారుల ఐడియా భలే ఉందిగా..
హైవేలపై నిత్యం ప్రమాదం జరిగిన వార్తల్ని వింటూ ఉంటాం. డ్రైవర్లు నిద్రలోకి జారుకోవడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. చైనాలో డ్రైవర్లు నిద్రపోకుండా హైవేలపై అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారో చదవండి.

China
China : ప్రపంచ వ్యాప్తంగా హైవేలు నిత్యం రక్తమోడుతూ ఉంటాయి. అతి వేగంగా వాహనం నడపడంతో పాటు డ్రైవర్లు నిద్రలోకి జారడం కూడా ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. నిద్రపోయే డ్రైవర్ల కోసం చైనా అధికారులు హైవేలపై ఎలాంటి ఏర్పాట్లు చేశారో తెలుసా?
రహదారులు సరిగా లేకపోవడం, అతి వేగం, అజాగ్రత్తతో పాటు డ్రైవర్లు నిద్రలోకి జారుకోవడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. నిత్యం అనేక రహదారుల ప్రమాద వార్తలను వింటూ ఉంటాం. ఈ ప్రమాదాలను నివారించడానికి అధికారులు ఎంత అవగాహన కల్పిస్తున్నా అరికట్టలేకపోతున్నారు. అయితే చైనీస్ అధికారులు మాత్రం డ్రైవర్లు నిద్ర పోకుండా నిలువరించడానికి హైవేలపై లేజర్ లైట్లు అమర్చారు. జనం కార్లను నడుపుతున్నప్పుడు హైవేలపై లైట్లు ప్రకాశవంతంగా మెరుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
@gunsnrosesgirl3 అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియోలో ‘చైనీస్ హైవేపే డ్రైవర్లు నిద్రపోకుండా నిరోధించడానికి లేజర్లు ఉపయోగించబడుతున్నాయి’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేసారు. ఈ వీడియోని ఇప్పటివరకు 63 మిలియన్ల మంది వీక్షించారు. 23 వేల మంది షేర్ చేసుకున్నారు. ‘చక్కని లేజర్‌లో.. నైట్ హైవే ఎంటర్టైన్ మెంట్’ అని .. ‘డ్రైవర్లను గాడిలో పెట్టడానికి ఇది మంచి ఆలోచన’ అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Lasers being used to prevent drivers from falling asleep on Chinese highwaypic.twitter.com/j9cxdFkXBA
— Science girl (@gunsnrosesgirl3) November 6, 2023