America Report on China: చైనాపై ‘ఇంటెలిజెన్స్ రిపోర్ట్’ విడుదల చేసిన అమెరికా.. ప్రతి భారతీయుడు ఇదేంటో తప్పక చదవాలి
ఈ నివేదిక భారతదేశానికి ముఖ్యమైనది ఎందుకంటే దీని ఆధారంగా న్యూఢిల్లీ బీజింగ్‌తో వ్యవహరించడానికి తన వ్యూహాన్ని సిద్ధం చేసుకోవచ్చు. ఆయుధాల సంఖ్యను బట్టి భారతదేశం ఏ దిశలో ఎక్కువగా పని చేయాలో అంచనా వేయడానికి అవకాశం ఇస్తుంది

America Report on China: భారత్-చైనా మధ్య ఉద్రిక్తత అనేది చరిత్రకు సంబంధించిన పాత విషయం. అయితే గత కొన్నేళ్లుగా సరిహద్దులో చైనా ప్రవర్తిస్తున్న తీరు కాస్త ఆందోళనకరంగా ఉంది. తన సమాచారాన్ని ప్రపంచానికి చేరకుండా దాచి పెడతారనే పేరు చైనాకు ఉంది. ఇక ఆ దేశ భద్రతకు సంబంధించినది అయితే, పొరపాటున కూడా ఎవరికీ తెలియకూడదనుకుంటారు. ముఖ్యంగా భారతదేశానికి అస్సలే తెలియకూడదు అనుకుంటారు.
ఈ విషయాన్ని రాయిటర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ పెంటగాన్ ఈ వారం చైనా సైన్యంపై తన వార్షిక నివేదికను విడుదల చేసింది. చైనా సైన్యం వద్ద ఎన్ని అణు బాంబులు ఉన్నాయి? చైనా ఎన్ని విదేశీ స్థావరాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది? ఈ మేరకు నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. చైనా జాతీయ భద్రతకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం నివేదికలో ఇచ్చారు. ఇందులో చైనాకు చెందిన ప్రతి ఆయుధం గురించిన సమాచారం ఇచ్చారు.
చైనా వద్ద ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి?
అణ్వాయుధాలు: చైనా వద్ద 500 ఆపరేషనల్ న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి. 2030 నాటికి అణ్వాయుధాల నిల్వ దాదాపు 1000కి పెరుగుతుంది. 2021లో చైనా అణుబాంబుల సంఖ్య 400 అని అమెరికా చెప్పింది. అణుబాంబుల సంఖ్య పరంగా చైనా ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది.
క్షిపణి: చైనా 2022లో మూడు కొత్త సైలో ఫీల్డ్‌ల నిర్మాణాన్ని పూర్తి చేసింది. చైనాలో 300 కొత్త ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు (ICBMs) ఉన్నాయి. సిలో అనేది క్షిపణులను నిల్వ చేసే ప్రదేశం. చైనా కూడా సంప్రదాయ ఖండాంతర క్షిపణి వ్యవస్థను సిద్ధం చేస్తోంది.
విదేశీ సైనిక స్థావరం: చైనా కూడా ప్రపంచవ్యాప్తంగా తన సైనిక ఉనికిని పెంచుకుంటోంది. మయన్మార్, థాయిలాండ్, ఇండోనేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కెన్యా, నైజీరియా, నమీబియా, మొజాంబిక్, బంగ్లాదేశ్, పాపువా న్యూ గినియా, సోలమన్ దీవులు, తజికిస్థాన్‌లలో చైనా తన సైనిక స్థావరాలను సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తోంది.
నౌకలు: చైనా ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాదళాన్ని కలిగి ఉంది. ఈ నౌకాదళం కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. చైనా నౌకాదళంలో 370 నౌకలు, జలాంతర్గాములు ఉన్నాయి. గతేడాది వాటి సంఖ్య 340. ఇక 2025 నాటికి చైనా నౌకాదళం 395 నౌకలకు, 2030 నాటికి 435 నౌకలకు చేరుకుంటుంది.
ఈ నివేదిక భారతదేశానికి ముఖ్యమైనది ఎందుకంటే దీని ఆధారంగా న్యూఢిల్లీ బీజింగ్‌తో వ్యవహరించడానికి తన వ్యూహాన్ని సిద్ధం చేసుకోవచ్చు. ఆయుధాల సంఖ్యను బట్టి భారతదేశం ఏ దిశలో ఎక్కువగా పని చేయాలో అంచనా వేయడానికి అవకాశం ఇస్తుంది. ఇలాంటి సమాచారం ఆధారంగా భారత్ సరిహద్దుల్లో సైనికులు, ఆయుధాల ఉనికిని పెంచిందని రాయిటర్స్ పేర్కొంది.