జిన్ పింగ్ పాకిస్థాన్ పర్యట వాయిదా

చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ పాకిస్థాన్ పర్యట వాయిదాపడింది. ఈ మేరకు పాకిస్థాన్ లోని చైనా అంబాసిడర్ యావో జింగ్ ప్రకటన చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో జిన్ పింగ్ పాక్ పర్యటన వాయిదా పడినట్లు యావో జింగ్ తెలిపారు. త్వరలో ఇరు దేశ ప్రభుత్వాలను సంప్రదించి కొత్త షెడ్యూల్ ఖరారు చేస్తామని తెలిపారు.
కాగా, జిన్ పింగ్‌ను పాక్ పర్యటనకు ఆ దేశ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. జిన్ పింగ్ పాక్ పర్యటన జరిగి ఉంటే కొన్నినెలలుగా తూర్పు లడఖ్‌లో భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలపైనా చర్చ జరిగి ఉండేదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఆగష్టు 29, 30 రాత్రి లడఖ్‌లోని పాంగాంగ్ ప్రాంతంలోకి చొరబాటుకు యత్నించిన చైనా దళాలను భారత సైన్యం అడ్డుకుని డ్రాగన్ కు గట్టి బుద్ది చెప్పిన విషయం తెలిసిందే.
https://10tv.in/pm-cares-fund-received-rs-3076-crore-in-just-5-days-but-the-names-of-these-generous-donors-will-not-be-revealed-why/
మరోవైపు, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) ప్రాజెక్టుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసిన పాకిస్థాన్ లోని చైనా రాయబారి యావో జింగ్ …భవిష్యత్తులో రెండు స్నేహపూర్వక దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని, చైనా వ్యాపార సంఘం…ఇతర రంగాలతో పాటు పాకిస్తాన్ వ్యవసాయ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆర్థిక కారిడార్‌కు వచ్చే ప్రమాదాల గురించి ఇరు దేశాలకు తెలుసునని, రెండు దేశాలు కలిసి వాటిని అధిగమిస్తాయని ఆయన అన్నారు.
.