కరోనాకు వ్యాక్సిన్ వచ్చేస్తోంది…మనుషులపై క్లినికల్ ట్రయిల్స్ ప్రారంభం

కరోనా వైరస్ కు వ్యతిరేకంగా ప్రపంచం చేస్తున్న పోరాటానికి అమెరికా సైంటిఫిక్ ల్యాబ్స్ మంచి ఊపునిచ్చాయి. యునైటెడ్ స్టేట్స్ సైంటిఫిక్ ల్యాబ్ లో కరోనా వైరస్ కు ట్రీట్మెంట్, నయం చేసే సామర్థ్యం ఉన్న మొదటి వ్యాక్సిన్ ఇప్పుడు మానవులపై పరీక్షించబడుతోంది. కరోనా వైరస్ నుండి రక్షించడానికి వ్యాక్సిన్ కోసం కోసం క్లినికల్ ట్రయల్‌లో పాల్గొన్న మొదటి వ్యక్తి సోమవారం ఒక ఎక్స్ పరిమెంటల్ డోస్(ప్రయోగాత్మక మోతాదు)ను అందుకున్నట్లు ఓ అమెరికా ప్రభుత్వ అధికారి తెలిపారు. ఈ ట్రయిల్ కు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నిధులు సమకూరుస్తోంది. ఇది సీటెల్ లోని కైజర్ పర్మనెంట్ వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లోఈ ట్రయిల్ జరుగుతోంది.
ఏదైనా పొటెన్షియల్ వ్యాక్సిన్‌ను పూర్తిగా ధృవీకరించడానికి ఏడాది నుంచి 18 నెలల సమయం పడుతుందని పబ్లిక్ హెల్త్ అధికారులు చెబుతున్నారు. NIH మరియు మోడెర్నా ఇంక్ సహ-అభివృద్ధి చేసిన ఢిఫరెంట్ షాట్స్ యెక్క డోసెస్ తో 45 మంది యువ,ఆరోగ్యకరమైన వాలంటీర్లతో టెస్టింగ్ ప్రారంభమవుతుంది. పాల్గొనేవారు షాట్ల నుండి వ్యాధి బారిన పడే అవకాశం లేదు, ఎందుకంటే వారు వైరస్ కలిగి ఉండరు. వ్యాక్సిన్లు ఎటువంటి ఆందోళన కలిగించే సైడ్ ఎఫెక్ట్ లు చూపించలేవని చెక్ చేయడమే దీని లక్ష్యం. ఇది పెద్ద పరీక్షలకు వేదికగా నిలిచింది.
కరోనా వైరస్(COVID-19) కేసులు పెరుగుతూనే ఉన్నందున ప్రపంచవ్యాప్తంగా డజన్ల కొద్దీ రీసెర్చ్ గ్రూప్ లు వ్యాక్సిన్‌ను క్రియేట్ చేసేందుకు పోటీ పడుతున్నాయి. మరీ ముఖ్యంగా, వారు వివిధ రకాలైన వ్యాక్సిన్లను అనుసరిస్తున్నారు(సాంప్రదాయిక వ్యాక్సిన్ ల కంటే వేగంగా ఉత్పత్తి చేయడమే కాకుండా మరింత శక్తివంతమైనదని రుజువు చేసే కొత్త టెక్నాలజీస్ నుండి అభివృద్ధి చేయబడిన షాట్లు).కొంతమంది పరిశోధకులు తాత్కాలిక టీకాలే లక్ష్యంగా పెట్టుకున్నారు.
మన దేశంలో కూడా కరోనా వైరస్ చాపకింద నీరులా వస్తుంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా పెరిగిపోతున్నాయి. దేశంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 114కి చేరిందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ కన్ఫర్మ్ చేసింది. మరోవైపు కేంద్రఆరోగ్యశాఖ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ పై సందేహాలు,అనుమానాలు తీర్చేందుకు కొత్త టోల్ ఫ్రీ నెంబర్,ఈ మెయిల్ ఐడీని సోమవారం లాంఛ్ చేసింది. జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1075. హెల్ప్ లైన్ ఈ మెయిల్ ఐడీ..nCOV2019@gmail.com. గతంలో ఉన్న హెల్ప్ లైన్ నెంబర్ 011-23978046కూడా ఆపరేషనల్ లో ఉంటుందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
కరోనా వైరస్(COVID-19)వ్యాప్తిని నిరోధించేందుకు ప్రైవేట్ సెక్టార్ ఆర్గనైజేషన్లు అన్నీ వర్క్ ఫ్రం హోం(ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం)ను ప్రోత్సహించాలని ఇవాళ(మార్చి-16,2020) కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ సూచించింది. సాధ్యమైన అన్ని చోట్లా ఉద్యోగులను ఇంటి నుండి పని చేయడానికి అనుమతించమని… ప్రైవేటు రంగ సంస్థలను, యజమానులను మేము ఎంకరేజ్ చేస్తున్నాము అని ఆరోగ్యమంత్రిత్వశాఖ ప్రతినిధి ఒకరు మీడియా సమావేశంలో తెలిపారు.