Amazon Forest: అమెజాన్ అడవిలో విమాన ప్రమాదంలో గల్లంతైన పిల్లలకు.. తల్లి చనిపోయే ముందు ఏం చెప్పింది?
అతను లేవగానే.. మా అమ్మ చనిపోయింది.. అని చెప్పాడు. అయితే, ఆ తరువాత మమ్మల్ని మీరు ఎవరు అని ఆ పిల్లలు ప్రశ్నించారు. మేము మీ స్నేహితులం, మమ్మల్ని మీ నాన్న, మామయ్య పంపించారు అని చెప్పాం

amazon Forest
children find wonder in the Amazon forest: అమెజాన్ అడవుల్లో మే1న జరిగిన విమాన ప్రమాదంలో గల్లంతైన నలుగురు చిన్నారులు 40 రోజులు తరువాత సురక్షితంగా బయటపడ్డారు. వీరిని సెర్చ్ అండ్ రెస్క్యూ సభ్యులు గుర్తించి కాపాడారు. ప్రస్తుతం వారు సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 13, 9, 5, ఒక సంవత్సరం వయస్సు కలిగిన చిన్నారుల ఆచూకీ కనిపెట్టి, వారిని కాపాడిన రెస్క్యూ టీం సిబ్బందిని ఓ ఆంగ్ల ఛానెల్ ఇంటర్వ్యూ చేసింది. పిల్లలు వారిని చూడగానే తొలుత ఏం చెప్పారో రెస్క్యూ టీం సిబ్బంది ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
Amazon forest: అమెజాన్ దట్టమైన అడవిలో పిల్లల ఆచూకీ ఎలా దొరికిందంటే…
సెర్చ్ అండ్ రెస్క్యూ సిబ్బందిలో ఒకరైన నికోలస్ ఆర్డోనెజ్ గోమ్స్ మాట్లాడుతూ.. పెద్ద పాప లెస్లీ తన చేతుల్లో చిన్న పిల్లవాడితో ఉంది. నన్ను చూడగానే నావైపు పరుగెత్తుకుంటూ వచ్చింది. నాకు ఆకలిగా ఉంది అని చెప్పింది. ఇద్దరు అబ్బాయిల్లో ఒకరు పడుకొని ఉన్నాడు. అతను లేవగానే.. మా అమ్మ చనిపోయింది.. అని చెప్పాడు. అయితే, ఆ తరువాత మమ్మల్ని మీరు ఎవరు అని ఆ పిల్లలు ప్రశ్నించారు. మేము మీ స్నేహితులం, మమ్మల్ని మీ నాన్న, మామయ్య పంపించారు అని చెప్పాం అని ఆర్డోనెజ్ గోమ్స్ చెప్పారు.
విమాన ప్రమాదంలో పిల్లల తల్లి నాలుగు రోజులు సజీవంగానే ఉంది. అయితే ఆమె చనిపోయే ముందు పిల్లలకు ఏం చెప్పిందో ఆర్డోనెజ్ గోమ్స్ వెల్లడించారు.. ‘మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. మీరు ఇక్కడి నుండి వెళ్లిపోండి. మీరు మీ నాన్న ఎలాంటి వ్యక్తి చూడబోతున్నారు. నేను చూపించిన గొప్ప ప్రేమను అతను మీకు చూపించబోతున్నాడు అని చనిపోయేముందు పెద్ద పాపకు ఆ తల్లి తెలిపింది. అయితే, పిల్లలు నలబై రోజులు పాటు దట్టమైన అడవిలో సజీవంగా ఉండటం అద్భుతమేనని వారు చెప్పారు.