గూగుల్ మ్యాజిక్ : ‘ఇడియట్’ అంటే ట్రంప్ ఫోటో: ఎందుకో చెప్పిన సీఈవో

  • Published By: Mahesh ,Published On : December 25, 2018 / 06:38 AM IST
గూగుల్ మ్యాజిక్ : ‘ఇడియట్’ అంటే ట్రంప్ ఫోటో: ఎందుకో చెప్పిన సీఈవో

కొన్ని వింత వింత సంఘటనలు నవ్వు తెప్పిస్తే..మరికొన్ని కోపం తెప్పిస్తాయి. మరికొన్ని చిత్ర విచిత్రమైన భావనలను కల్పిస్తాయి. ఇదిగో ఈ సందర్భానికి మాత్రం నవ్వాలో..నవ్వు ఆపుకోవాలో తెలియటంలేదు. దీనికి ప్రముఖ సెర్చింగ్ ఇంజిన్ గూగుల్ వేదిగా జరుగుతోంది.  గూగుల్ లో బగ్స్ కారణంగా చిత్రవిచిత్రమైన ఫలితాలు వచ్చే క్రమంలో గూగుల్ సెర్చ్ లో ‘ఇడియట్’ అని టైప్ చేసారనుకోండి..ఏం చూపిస్తోందో తెలుసా? ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫొటోలు వస్తున్నాయట. దీంతో బేజారెత్తిపోయిన అమెరికా ప్రతినిధుల సభ గూగుల్ కు నోటీసులు జారీచేసింది. మరి అమెరికా అధ్యక్షుడా మజాకానా? గూగుల్ సంస్థ ప్రతినిధులు తమముందు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించింది. ఈ నేపథ్యంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ హౌస్ జ్యుడీషియరీ కమిటీ ముందు హాజరయ్యారు. 
దీంతో కాలిఫోర్నియా నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికైన జో లాఫ్గ్రెన్ ‘గూగుల్ లో ఇడియట్ అని టైప్ చేయగానే ట్రంప్ ఫొటోలు వస్తున్నాయి..గూగుల్ రాజకీయ వివక్ష పాటిస్తోందా? అని ప్రశ్నించగా దీనికి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సమాధానమిస్తు..
ఇంటర్నెట్ లో ఉండే కోట్లాది వ్యాసాలు, కథనాలు, వీడియోలను విశ్లేషించిన మీదట గూగుల్ తనకు తాను అన్వయించుకుని ఈ ఫలితాలను అందిస్తుందనీ.. ఇంటర్నెట్ లో ఎక్కుమంది వెతికిన, చూసిన అంశాలను, ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న విషయాలను చూపుతుందన్నారనీ..అంతేతప్ప ఇందులో మా ప్రమేయం ఎంతమాత్రం ఉండదని స్పష్టం చేశారు. గతంలో భారత్ లో పప్పు ఎవరు? అని గూగుల్ లో సెర్చ్ చేస్తే కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఫొటోలు దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. మరి తెలిసింది కదా? ఇడియట్ అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎందుకొస్తున్నాడో..ఇటువంటి మ్యాజిక్స్ గూగుల్ తల్లికి అలవాటేనన్నమాట…!!