దిగ్విజయ్ ట్వీట్‌లో రాంగ్ ఫోటో..నెటిజన్ల విమర్శలు

  • Published By: Mahesh ,Published On : December 25, 2018 / 06:38 AM IST
దిగ్విజయ్ ట్వీట్‌లో రాంగ్ ఫోటో..నెటిజన్ల విమర్శలు

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ పొరపాటున తన ట్వీట్‌లో రాంగ్ ఫోటో జతచేయడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.త్తరప్రదేశ్ బీజేపీ సర్కారును ఇరుకున పెట్టేందుకు దిగ్విజయ్ సింగ్ తన ట్వీట్‌లో వాడకుండా వదిలేసి పాడైపోయిన 108, 102 అంబులెన్సు వాహనాలున్న ఫోటోను తన ట్వీట్‌లో జతచేయడం వివాదాస్పదమైంది. అయితే తెలుగులో రాసి ఉన్న ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం’ అన్న పేరును చూడకుండా ఫోటోను అప్‌లోడ్ చేయడంతో దిగ్విజయ్ సింగ్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పించారు.

గతేడాది సెప్టెంబరులో ఇటువంటి కామెంట్లతో దిగ్విజయ్ సింగ్ ప్రధాని మోదీపై వివాదస్పద వ్యాఖ్యలు ట్విట్టర్‌లో చేసి నాలిక కరుచుకున్న సంగతి తెలిసిందే..ఇప్పుడు తాజాగా పాడై పోయిన అంబులెన్సుల ఫోటోతో మరో సారి వార్తల్లోకి ఎక్కారు.