జ్వరం రాకపోయినా.. ఈ రెండు లక్షణాలు కరోనాకి కారణం కావచ్చు

  • Published By: vamsi ,Published On : March 21, 2020 / 11:24 PM IST
జ్వరం రాకపోయినా.. ఈ రెండు లక్షణాలు కరోనాకి కారణం కావచ్చు

Updated On : March 21, 2020 / 11:24 PM IST

కరోనా వైరస్ బారిన పడ్డ వారిని గుర్తించడం రోజురోజుకు కత్తిమీద సాములా మారిపోతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు కేవలం జ్వరం, జలుబు, దగ్గు ఉన్నవారిని మాత్రమే కరోనా వ్యాధిగ్రస్తులుగా డాక్టర్లు గుర్తిస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం మరి కొన్ని లక్షణాలు కూడా కరోనా వ్యాధిగ్రస్తుల్లో కనిపిస్తున్నాయి. 

జ్వరం లేదా దగ్గు లేనివారు కరోనావైరస్ సంక్రమించిన తర్వాత వాసన లేదా రుచిని కోల్పోవడం ఒక లక్షణంగా చెబుతున్నారు. కరోనావైరస్ ఎంటర్ అయ్యేది తరచుగా కళ్ళు, ముక్కు మరియు గొంతు ప్రాంతాలలో అని వాసన మరియు రుచి భావనలు కోల్పోవడం లక్షణంగా భావించవచ్చునని వారు అభిప్రాయపడుతున్నారు. 

వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం కరోనా బారిన పడిన వారిలో వాసన, రుచి సామర్థ్యం బలహీనపడుతుంది. అంతేకాదు 66 శాతం మంది రోగులలో ఈ లక్షణాలు కనిపించాయట. అలాగే విరేచనాలు కరోనా వ్యాధికి ఉన్న మరో లక్షణం అని చెబుతున్నారు. కరోనా రోగులలో 30 శాతం మందిలో ఈ లక్షణం కనిపిస్తుంది.

కరోనా వైరస్ సోకిన చాలా మంది రోగులకు మొదట జ్వరం వస్తుందని, అలసట, కండరాల నొప్పులు, పొడి దగ్గు తదితర లక్షణాలు కనిపిస్తాయని, కొంతమందికి ఒకటి లేదా రెండు రోజుల పాటు వాంతులు, విరేచనాలు అవుతా జ్వరం లేకపోయినా రుచి లేదా వాసన కోల్పోతే కరోనా లక్షణాలు కావచ్చు అని డాక్టర్లు చెబుతున్నారు.