కొవిడ్ లాక్‌డౌన్‌లో వృద్ధుల కంటే యువతే రెండింతలు ఒంటరితనంతో బాధపడుతోందంట!

  • Published By: srihari ,Published On : June 12, 2020 / 12:56 PM IST
కొవిడ్ లాక్‌డౌన్‌లో వృద్ధుల కంటే యువతే రెండింతలు ఒంటరితనంతో బాధపడుతోందంట!

Updated On : June 12, 2020 / 12:56 PM IST

ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచమంతా ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. అలాగే మనుషుల్లోనూ వారి ఆలోచనలు, అలవాట్లలోనూ మార్పులకు కారణమైంది. ప్రతిఒక్కరిలోనూ కరోనా భయం వెంటాడుతోంది. మందు లేని కరోనాను ఎలా ఎదుర్కోవాలో తెలియక ప్రపంచ దేశాలు సైతం పోరాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో యువత నుంచి వృద్ధుల వరకు అందరిలోనూ కరోనా కలవరం మొదలైంది. చాలామంది అందరూ ఉండి కూడా ఒంటరిగా బాధపడుతున్నారు.

సామాజిక దూరం, ఫేస్ మాస్క్ జీవితంలో భాగమై పోయాయి. ఇప్పుడు చాలా మందిని ఎక్కువగా వేధిస్తున్న సమస్య ఒక్కటే.. ఒంటరితనం.. ఇదక్కడే మనిషిని కృంగదీస్తోంది. సాధారణంగా వృద్ధుల్లో ఈ ఒంటరితనం ఎక్కువగా వేధిస్తుంటుంది. ఇప్పుడు కరోనా లాక్ డౌన్ సమయంలో యువత వృద్ధుల కంటే రెండింతలు ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారంటూ అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ, కరోనాకు ముందు రోజుల్లా రాబోయే రోజులు ఉండేలా లేవు.. లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ కూడా అన్ని సర్వీసులు ప్రారంభమైనా సరే.. కరోనాతో కలిసి జీవించాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. 

1. వృద్ధుల కంటే యువత ఒంటరితనంతో బాధపడే అవకాశం :
సామాజిక దూరం పాటించాలి. ఫేస్ మాస్క్ ధరించాలి. ఒకప్పటిలా అందరూ ఒకేచోట కలుసుకునే రోజులు పోయాయి. అప్పటికప్పుడూ ప్లాన్ చేసుకునే రోజులివి. ఇటీవలి పరిశోధనల ప్రకారం.. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఒంటరితనం వృద్ధులతో పోల్చినప్పుడు యువత, మహిళలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

2. అధ్యయనం ఏమి చెబుతుంది :
ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ (ONS) చేసిన విశ్లేషణ ప్రకారం.. కరోనావైరస్ లాక్ డౌన్ సమయంలో 16 నుంచి 24 ఏళ్ల వయస్సులో 50 శాతం మంది ఒంటరిగా ఉన్నారు. baby boomersతో పోల్చినప్పుడు చాలా ఎక్కువ (55-69 ఏళ్ల గ్రూపు) లాక్ డౌన్ కారణంగా పావు వంతు (24.1 శాతం) ఒంటరితనంగా ఫీల్ అవుతున్నట్టు నివేదించింది. అధ్యయనంలో భాగంగా 5,260 మంది పెద్దలను ‘దీర్ఘకాలిక ఒంటరితనం’ గురించి ప్రశ్నించింది. 

virus covid

గత ఏడు రోజులలో లాక్ డౌన్ సమయంలో ఒంటరిగా ఉన్నారా అని గ్రూపులో 2,440 మందిని అడిగారు. ఏప్రిల్ 3 నుంచి మే 3 మధ్య సేకరించిన డేటా, వయస్సుతో ఒంటరితనం అనుభవించే వారిని కలిపి లెక్కించింది. చిన్న వయస్సు వారితో పాటు, 70 అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో 50 శాతం మంది లాక్ డౌన్ సమయంలో ఒంటరిగా ఉన్నట్టు గుర్తించింది. 

3. మహమ్మారితో ఒంటరితనం : 
లాక్ డౌన్ సమయంలో ఒంటరితనంతో పోరాడే చిన్న, పెద్ద వయస్సు మధ్య వ్యత్యాసం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆన్‌లైన్‌లో వేలాది మంది స్నేహితులు / ఫాలోవర్లు ఉంటారు. సామాజిక అంశాలపై చర్చిస్తుంటారు. కానీ, చివరికి ఆ వర్చువల్ సంబంధాలలో చాలా కొద్దిమంది మాత్రమే స్పష్టమైన స్నేహాలను కలిగి ఉంటారు. సర్వేలో (70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న) పెద్దవారికి, భాగస్వామి లేకుండా జీవించడం.. వారి కుటుంబానికి దూరంగా ఉండటమే అతి పెద్ద కారణమని చెప్పవచ్చు. 
​​old covid

4. లాక్ డౌన్ డేటా :
‘ఒంటరితనం’ మీ ఆరోగ్యంతో పాటు ఆర్థిక స్థితి, తమ వ్యక్తిత్వాలకు తక్కువ సంబంధం కలిగి ఉండవచ్చనే దానిపై లాక్ డౌన్ డేటా విశ్లేషించింది. ఒంటరిగా ఉన్నవారు, ఒంటరిగా జీవిస్తున్నవారు, ఏదైనా వైద్య పరిస్థితులతో బాధపడుతున్నవారు సమాజం నుంచి దూరమయ్యారని ఒంటరితనంగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఒంటరిగా ఉండటం వల్ల మహమ్మారి వంటి పరీక్ష సమయాల్లో ప్రజలు సహాయక నెట్‌వర్క్‌ను గుర్తించడం చాలా కష్టంగా మారుతోంది.
old woman

5. అందరికి ఒకరినొకరు సాయం అవసరం :
అందరూ కరోనా కష్టకాలంలో జీవిస్తున్నందున.. సమాజంగా మనం ఒకరినొకరు సహకరించుకోవడం ముఖ్యం. మన పొరుగువారిని చెకింగ్ చేయడం ద్వారా ప్రారంభించవచ్చు. ఒంటరిగా నివసించే వృద్ధులు కావచ్చు. ఇద్దరు తల్లి లేదా ఒంటరి మనిషి కావొచ్చు. మహమ్మారి సమయంలో వారు ఒంటరిగా మాత్రమే ఫీల్ అయ్యే అవకాశం లేదని గుర్తుంచుకోండి. కానీ రోజు మొత్తం వారికి అవసరమైన నిత్యావసరాల కోసం కష్టపడుతున్నారు. అలాంటి వారిని గుర్తించి వారికి సహాయం అవసరమా అని అడగండి. కానీ, ఫేస్ మాస్క్ ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడాన్ని అసలే మర్చిపోవద్దు. 
coronavirus