కరోనా కథ సమాప్తం…వెలిగిపోతున్న వూహాన్

  • Published By: venkaiahnaidu ,Published On : March 20, 2020 / 09:30 AM IST
కరోనా కథ సమాప్తం…వెలిగిపోతున్న వూహాన్

Updated On : March 20, 2020 / 9:30 AM IST

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచదేశాలన్నీ వణికిపోతున్నాయి. 161దేశాలకు పాకిన ఈ వైరస్ ఇప్పటివరకు 9వేలమందిని బలితీసుకొంది. 2లక్షల 25వేల మందికిపైగా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతుండగా,అందులో దాదాపు 10వేలమంది పరిస్థితి సీరియస్ గా ఉంది. దేశాల సరిహద్దులు కూడా మూసివేయబడ్డాయి, మన దేశంలో కూడా చాపకింద నీరులా రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు భారత్ లో ఐదు కరోనా మరణాలు నమోదయ్యాయి.

అయితే ఇదిలా ఉంటే,అసలు వైరస్ మొదటగా గతేడాది డిసెంబర్ లో చైనాలోని హుబేయ్ రాష్ట్రంలోని వూహాన్ సిటీలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రపంచమంతా ఇప్పుడు కరోనా మహమ్మారి గురించి ఆందోళన చెందుతున్న సమయంలో వూహాన్ సిటీలో మాత్రం ఇప్పుడు కరోనా ఖతమైపోయిందంటున్నారు అక్కడి అధికారులు. (కరోనా భయం: పదోతరగతి పరీక్షలు వాయిదా)

హుబే రాష్ట్రంలో కానీ,వూహాన్ సిటీలో కానీ కొత్తగా కరోనా కేసులు నమోదవడం లేదని అక్కడి అధికారులు చెబుతున్నారు. అయితే గరువారం 34కరోనా కేసులు నమోదైనప్పటికీ,ఆ 34మంది విదేశీయులేనని తెలిపారు. కరోనాను పూర్తిగా అక్కడ అదుపులోకి తీసుకురాగలిగారు. దాదాపు నాలుగు నెలల తర్వాత వూహాన్ సిటీ ఇప్పుడు వెలిగిపోతుంది. సాయంకాల సమయంలో వూహాన్ సిటీలో బిల్డింగ్ లు అన్నీ లైట్లతో వెలిగిపోతున్న ఫొటోలను చైనా మీడియా ట్విట్టర్ లో షేర్ చేసింది.

ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వుహాన్ లోని భవనాలు అంకితమైన మెడిక్స్ కోసం ఉత్సాహంగా నినాదాలతో ప్రకాశిస్తున్నాయి అంటూ చైనా మీడియా ఆ ఫొటోలను షేర్ చేసింది.ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు కరోనాను కట్టడి చేసిన చైనాను అభినందిస్తున్నారు. మిగతా ప్రపంచం చైనా ను చూసి నేర్చుకోవాలని పలువురు నెటిజన్లు ట్వీట్ లు చేస్తున్నారు. గుడ్ న్యూస్ చెప్పారు అంటూ మరికొందరు ట్వీట్ లు చేస్తున్నారు.