శ్రీలంక బౌద్ధ తీర్థయాత్రికులకు భారత్‌కు నో ఎంట్రీ

శ్రీలంక పర్యాటకులు భారత్‌కు వెళ్లకూడదని లంక ప్రభుత్వం కండిషన్ పెట్టింది. బౌద్ధ తీర్థయాత్రికులు భారత్‌కు వెళ్లొద్దంటూ కఠిన ఆంక్షలు విధించింది. తీర్థయాత్రలకు వయస్సులో పైబడిన ఉంటారు కాబట్టే కరోనా సోకే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ‘ఇటువంటి పర్యటనలకు వెళ్లేవారిలో వయో వృద్ధులే ఉంటారు. వారికి కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది’ అని జనరల్ హెల్త్ సర్వీసెస్ డైరక్టర్ అనిల్ జసింగ్ అన్నారు.
‘దంబాడివా వందన’ అనే తీర్థ యాత్రలో భాగంగా భారత్‌లోని బోధ్‌గయా, వారణాసి, శర్ణాత్, నేపాల్‌లో ఉన్న లుంబినీ ప్రాంతాలను సందర్శిస్తారు భక్తులు. లంకకు కరోనా వైరస్ సోకకూడదనే భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే శ్రీలంక ఎయిర్ లైన్స్ కూడా చైనా, సౌదీ అరేబియాల నుంచి వచ్చే విమానాలను సస్పెండ్ చేసేసింది. దక్షిణకొరియా, ఇరాన్, ఇటలీ దేశాల నుంచి వచ్చే వారికి నో ఎంట్రీ అన్నమాట.
శ్రీలంకలో ఇప్పటి వరకూ ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదు. అక్కడి వర్గాలు ముందుగానే హెచ్చరించాయి. టూరిజం, ఎక్స్‌పోర్ట్ విభాగాలకు సూచనలు జారీ చేయడంతో అక్కడ జాగ్రత్తలు పెరిగిపోయాయి. కేరళలో ఒక్క కేసు మాత్రమే నమోదైంది. చైనా నుంచి వచ్చిన టూరిస్ట్ ఇన్ఫెక్షన్‌కు గురై ట్రీట్‌మెంట్ పూర్తి అయిన తర్వాత డిశ్చార్జ్ అయింది.
ఫిబ్రవరి 27న భారత ఎయిర్‌క్రాఫ్ట్‌లో చైనాలోని వూహాన్ సిటీ నుంచి 76మంది భారతీయులతో పాటు 36మంది విదేశీయులను తీసుకువచ్చారు. భారత్‌లో ఇప్పటివరకూ 43కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. రిపోర్ట్‌ల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 100దేశాల్లో కరోనా కేసులు లక్షా 10వేలు నమోదైనట్లు గుర్తించారు.
See Also | కాల్ చేస్తే కరోనా దగ్గు వినిపిస్తుందా.. ఇలా ఆపేయండి