BE ALERT : కరోనాకు వ్యాక్సిన్ రావాల్సిందే – WHO హెచ్చరికలు

కరోనాకు వ్యాక్సిన్ రావాల్సిందేనంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ప్రస్తుతం ఈ ముప్పుతో ప్రపంచ మానవాళి బయటపడే అవకాశం లేదని చెప్పడంతో అందరిలో భయాందోళనలు నెలకొన్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకు జాగ్రత్త పడాల్సిందేనని దేశాలకు సూచించింది. స్వైన్ ఫ్లూ కంటే పదిరెట్లు ప్రమాదకరమని WHO అధికార ప్రతినిధి డా.డేవిడ్ నాబర్రో వెల్లడించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా దేశాలు నియంత్రణ చర్యల ఆంక్షలను దశలవారీగా నెమ్మదిగా ఎత్తివేయాలని సూచించింది.(ఇండియాలో కరోనా @ 10వేలు)
మరోవైపు కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు వివిధ దేశాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసికి చెక్ పెట్టేందుకు పరిశోధనలు చేస్తున్నారు. వ్యాక్సిన్ తయారీకై అనేక సంస్థలు పూర్తి ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి 12 నుంచి 18 నెలలు పడుతుందని అధిక శాతం మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అప్పటి వరకు ఇంకెంత మంది చనిపోతారనే భయం అందరిలో నెలకొంది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలతో వివిధ దేశాలు మరింత అలర్ట్ అయ్యాయి.