బీకేర్ ఫుల్, కరోనా సోకిన వారిలో ఎక్కువమంది పొగతాగే వారే, కారణం ఇదే

కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 18లక్షల 53వేల మంది కరోనా బారిన పడ్డారు.

  • Published By: veegamteam ,Published On : April 13, 2020 / 09:35 AM IST
బీకేర్ ఫుల్, కరోనా సోకిన వారిలో ఎక్కువమంది పొగతాగే వారే, కారణం ఇదే

Updated On : April 13, 2020 / 9:35 AM IST

కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 18లక్షల 53వేల మంది కరోనా బారిన పడ్డారు.

కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 18లక్షల 53వేల మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటివరకు లక్షా 14వేల మందిని బలితీసుకుంది. 4లక్షల 23వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. 2019 డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో కరోనా వైరస్ వెలుగుచూసింది. చైనాని నాశనం చేసిన ఈ మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాలపై పడింది. ప్రజలు ప్రాణాలను మాస్క్ లో పెట్టుకుని బతుకుతున్నారు. వైరస్ వెలుగులోకి వచ్చి 5 నెలలు అవుతున్నా ఇంతవరకు వ్యాక్సిన్ కనిపెట్టలేకపోయారు. అసలు వైరస్ గురించి తెలియాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. దాని మిస్టరీని చేధించే పనిలో ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు, డాక్టర్లు ఉన్నారు.

ఇకపోతే కరోనా గురించి మరో షాకింగ్ న్యూస్ తెలిసింది. కరోనా బాధితుల్లో ఎక్కువమంది పొగతాగే వారేనని తేలింది. అంటే స్మోకింగ్ అలవాటు ఉన్న వారిని కరోనా రిస్క్ ఎక్కువన్న మాట. ఇతరులతో పోలిస్తే స్మోకింగ్ చేసే వారు డేంజర్ జోన్ లో ఉన్నారు.

పొగతాగే వారిపై కరోనా వైరస్‌ అధికంగా ప్రభావం చూపుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చిచెప్పింది. దీనికి కారణం కూడా చెప్పింది. పొగ పీల్చినప్పుడు ఎస్-2 ఎంజైమ్‌ను ముక్కు అధికంగా స్రవిస్తుందని, కరోనా వైరస్‌ నేరుగా, వేగంగా ఊపిరితిత్తుల్లోకి చేరుకునేందుకు ఇది బాటలు వేస్తోందని స్పష్టం చేసింది. చైనా, ఇటలీలలో అత్యధిక శాతం కరోనా రోగులు పొగతాగేవారేనని డబ్ల్యూహెచ్ వో వెల్లడించింది. తీవ్ర శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారిపై కూడా కరోనా వైరస్‌ అంతే తీవ్రంగా దాడి చేస్తుందని స్పష్టం చేసింది. ప్రపంచంలో కోవిడ్‌-19 వ్యాప్తిపై డబ్ల్యూహెచ్‌వో శ్వాసకోశ వైద్య నిపుణుడు జానీస్‌లీంగ్‌ అధ్యయనం చేశారు.. 

అధ్యయనంలో వెలుగుచూసిన విషయాలు:
* పొగతాగే వారే అత్యధిక శాతం కరోనా బారిన పడినట్టుగా ఈ అధ్యయనంలో వెల్లడైంది. 
* చైనాలో కరోన బారిన పడిన 82,052 మందిలో 95% మంది పొగతాగే అలవాటున్న వారేనని అధ్యయనంలో తేలింది. 
* ఇటలీ లోనూ సింహభాగం కరోనా రోగులకు పొగతాగే అలవాటున్నట్టు గుర్తించారు.  
* కరోనా బారిన పడిన వారిలో పొగతాగేవారి తర్వాతి స్థానం తీవ్ర శ్వాసకోశ, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడేవారిదేనని వెల్లడైంది. 
* పొగ తాగడం మానేసేందుకు ఇంతకంటే మంచి సమయం రాదని జానీస్‌లీంగ్‌ చెప్పారు.

సో.. స్మోకింగ్ అలవాటు ఉన్న వారు బీ కేర్ ఫుల్. ఈ కొన్ని రోజులు జాగ్రత్త పడాల్సిందే. స్మోకింగ్ కు దూరంగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. లేదంటే కరోనా బారి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. ఆ తర్వాత ఎంత చింతించినా లాభం లేదని వైద్య నిపుణులు అంటున్నారు.