కరోనా ఎఫెక్ట్ : TV సీరియళ్లలో ముద్దు సీన్లు కట్!

  • Published By: sreehari ,Published On : February 10, 2020 / 06:37 AM IST
కరోనా ఎఫెక్ట్ : TV సీరియళ్లలో ముద్దు సీన్లు కట్!

Updated On : February 10, 2020 / 6:37 AM IST

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనా నుంచి మొదలై ప్రపంచ దేశాలకు పాకింది. వందలాది మంది ప్రాణాలను బలితీసుకుంది. వేలాది మంది వైరస్ సోకి ప్రాణపాయ పరిస్థితుల్లో ఉన్నారు. ఎప్పుడు ఏ క్షణంలో ఏ వైపు నుంచి కరోనా కాటేస్తుందోనని ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు భయాందోళన వ్యక్తం చేస్తున్నాయి. పక్కనే ఉన్న ఎవరైనా కొంచెం తుమ్మిన లేదా దగ్గినా వెంటనే కరోనా గుర్తుకొస్తోంది. వైరస్ ఎక్కడ అంటుకుంటుందోనని భయంతో దూరంగా పారిపోతున్నారు జనం.. కరోనా భయం కేవలం అన్నిచోట్లా ఉంది. 

ఏది వస్తువు ఇతరుల నుంచి తీసుకోవాలన్నా? ఇవ్వాలన్నా భయపడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ దెబ్బ ఇప్పుడు టెలివిజన్ ఇండస్ట్రీపై పడింది. బుల్లితెర ప్రేక్షకులను అలరించే సీరియల్స్ లో కరోనా సెన్సార్ కట్ చేస్తున్నారు. టీవీ సీరియళ్లకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అలాంటి సీరియళ్లలో ముద్దు సీన్లను కట్ చేస్తున్నారంట. కరోనా వైరస్ ఎక్కడ సోకుతుందోననే భయంతో కనీసం తాకేందుకు కూడా భయపడే పరిస్థితి నెలకొంది. 

చైనాలోని తైవానీల్లో టెలివిజన్ నటీనటులు ఏ సీన్ అయినా ఓకే.. ముద్దు సీన్ మాత్రం వద్దు అంటున్నారట. దీంతో అక్కడి టీవీ సీరియల్స్ మేకర్లు ముద్దు సీన్ల జోలికి పోవడం లేదు. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న ప్రాంతం కావడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎప్పుటినుంచో వస్తున్న టీవీ సీరియల్ గోల్డెన్ సిటీలో నటి మియా చియూ మరో నటుడు జున్ ఫును ఒక సెకన్ పాటు ముద్దాడింది. ఈ సీరియల్ లో వారి పాత్రలకు ఎక్కువ సేపు లిప్ లాక్ సీన్ లో నటించాల్సి ఉంటుంది. కిస్ సీన్ తో సన్నివేశాన్ని రక్తికట్టించాలంటే లిప్ లాక్ చేయాల్సిందే.. కరోనా భయంతో కిస్ సీన్లలో చిన్న మార్పులు చేశారు. లైట్ కిస్ తో సరిపెడుతున్నారు. 

మరోవైపు టీవీ సీరియళ్లు తీసే సమయంలో ఎక్కువగా జనం ఉన్నప్పుడు మాస్క్ లతోనే షూటింగ్ లు చేసేసుకుంటున్నారు. అందరికి మాస్క్ లు ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఒక సన్నివేశంలో సీన్ ప్రకారం.. నటుడు వెస్‌లో.. నటి అవిస్ జాంగ్ మీద పడిపోవాలి. అప్పటికే నటుడు జ్వరంతో బాధపడుతున్నాడు. అయినప్పటికీ ఈ సీన్ ఆమెకు 10 సెంటీమీటర్ల కంటే తక్కువ దూరం నుంచి సీన్ నటించాల్సి వచ్చింది. ఈ క్రమంలో నటి జాంగ్ కు కూడా కాస్తా అనారోగ్యానికి గురైనట్టు రిపోర్టు తెలిపింది. భవిష్యత్తులో మళ్లీ కిస్ సీన్లలో నటిస్తే.. ఆ సమయంలో తనకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు లేకుండా చూసుకుంటానని జోక్ పేల్చాడు.