2020 సెప్టెంబర్ నాటికి మిలియన్ మోతాదుతో కరోనా వ్యాక్సీన్లు సిద్ధం.. సైంటిస్టుల టార్గెట్

కరోనా వైరస్ (కొవిడ్-19) వ్యాప్తిని పూర్తిగా నిర్మూలించాలంటే.. వ్యాక్సీన్ ఒక్కటే మందు. కరోనాను కట్టడి చేసేందుకు లాక్ డౌన్, నియంత్రణ చర్యలు కేవలం తాత్కాలికం మాత్రమే. కరోనా వైరస్‌ను నిర్మూలనకు వ్యాక్సీన్ అవసరం ఎంతో ఉంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులందరూ కరోనా వ్యాక్సీన్ కనిపెట్టేందుకు పరిశోధనలు, అధ్యయనాల్లో బిజీగా ఉన్నారు.
కరోనాను అంతం చేసేందుకు వ్యాక్సీన్లు సాధ్యమైనంత తొందరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు యద్ధ ప్రాతిపాదికన పరిధోనలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ కరోనా వ్యాక్సీన్ అందుబాటులోకి రావాలంటే కనీసం ఏడాదన్నర సమయం పట్టే అవకాశం ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు.
యూకే సైంటిస్టుల లక్ష్యం ఇదే :
అయితే, ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి కరోనా వైరస్ వ్యాక్సీన్‌ను మిలియన్ మోతాదు సిద్ధం చేయాలని University of Oxford లోని సైంటిస్టులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టుకు యూకే ప్రభుత్వం కూడా పూర్తి మద్దతును అందిస్తోంది. కరోనా వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుందో కచ్చితమైన తేదీలను వెల్లడించలేకపోవచ్చు.. దీనికి గ్యారెంటీ ఇవ్వలేమని పేర్కొంది.
వచ్చేవారంలో కరోనా సోకిన తొలి బాధితులు Oxford ట్రయల్స్‌లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ వ్యాక్సీన్లు ఎంత సురక్షితమైనవో లేదా సమర్థవంతంగా పనిచేస్తాయో లేదో అతిత్వరలో తేలనుంది. చాలామంది నిపుణులు కూడా ఒక వ్యాక్సీన్ పూర్తి స్థాయిలో రూపొందించాలంటే కనీసం 12 నుంచి 18 నెలల సమయం పడుతుందని నొక్కి చెబుతున్నారు.
కరోనా వ్యాక్సీన్ అంటే ఏంటి?
కరోనా వంటి వైరస్‌లతో వ్యాధిని వ్యాప్తిచేయకుండా నిరోధించేందుకు మనిషి శరీరంలోని వ్యాధినిరోధక వ్యవస్థను వ్యాక్సీన్లు పటిష్టం చేస్తాయి. ఒకవేళ వ్యాధినిరోధకత సమర్థవంతంగా పనిచేస్తే.. సామాజిక దూరం వంటి చర్యలను దీర్ఘకాలం తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉండదు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 80 గ్రూపుల్లో ప్రధానంగా పార్మాసెటికల్ కంపెనీలు సహా ఇతర కంపెనీలు వ్యాక్సీన్ డెవలప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొన్ని ఫార్మా కంపెనీలు ఇప్పటికే హ్యుమన్ ట్రయల్స్ కూడా మొదలుపెట్టేశాయి. ఈ వ్యాక్సీన్ పరిశోధనలు వేగవంతంగా జరుగుతున్నాయి. ఏళ్ల తరబడి సాగే పరిశోధనలు కాస్తా యుద్ధ ప్రాతిపాదికన నెలల్లోనే పూర్తిచేసేలా పరిశోధనలు కొనసాగుతున్నాయి.
Oxford పరిశోధనలో ఏం చేసింది? :
యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్ కు చెందిన పరిశోధక బృందం.. ప్రస్తుత కరోనా వైరస్ వ్యాప్తికి ముందు నుంచే కొవిడ్-19 మహమ్మారికి సంబంధించి పరిశోధనలకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే జన్యుపరంగా ఇంజనీరింగ్ చేసిన చింపాంజీ వైరస్‌ను సృష్టించారు. ఇది కొత్త టీకాకు ఆధారం అవుతుంది. దానిని కొత్త కరోనావైరస్ భాగాలతో కలిపారు. ఫలితంగా ఆశాజనకమైన కోవిడ్ -19తో పోరాడటానికి రోగనిరోధక వ్యవస్థకు శిక్షణ ఇచ్చే సురక్షితమైన వైరస్‌గా తేల్చారు.
ఈ ప్రయోగాత్మక వ్యాక్సిన్ వాస్తవానికి పని చేస్తుందా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న ప్రధాన పరిశోధకురాలు ప్రొఫెసర్ Sarah Gilbert మాత్రం 80శాతం ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు. ‘ఇది నా అభిప్రాయం, ఎందుకంటే నేను ఈ టెక్నాలజీతో చాలా పనిచేశాను. నేను మెర్స్-వ్యాక్సిన్ ట్రయల్స్ (మరొక రకమైన కరోనావైరస్)పై పనిచేశాను. అది ఎలా పనిచేయగలదో చూశాను. వ్యాక్సీన్ పని చేయడానికి చాలా బలమైన అవకాశం ఉంది’ అని ఆమె అభిప్రాయపడ్డారు.
వ్యాక్సీన్.. ఎప్పుడు రెడీ అవుతుందంటే? :
కరోనా వ్యాక్సీన్ భారీ మొత్తంలో రెడీ చేసేందుకు ఇదివరకే పరిశోధక బృందం ప్లాన్లను అమలు చేస్తోంది. ఈ వ్యాక్సీన్ పనిచేస్తుందా? పని చేస్తుందో లేదో తెలియక ముందే ఈ బృందం భారీగా ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒకసారి వ్యాక్సీన్ ఫలితాలు, సమర్థత తెలిశాక, అక్కడి నుంచి మరింత వేగంగా వెళ్లిన తర్వాత 2020 సెప్టెంబర్ నాటికి కనీసం మిలియన్ (10 లక్షల) వ్యాక్సీన్ మోతాదులే లక్ష్యమని Jenner Institute at Oxford ప్రొఫెసర్ Adrian Hill చెప్పారు. ఈ మహమ్మారిని అంతం చేయడానికి, ప్రపంచాన్ని లాక్ డౌన్ నుండి బయటకు తీసుకురావడానికి వందల మిలియన్ల మోతాదుల వ్యాక్సీన్ అవసరమవుతాయని స్పష్టంగా తెలుస్తుందని ఆయన తెలిపారు.
ఫలితాలు ఎప్పుడు తెలుస్తాయి? :
రాబోయే కొద్ది నెలల్లో వారి వ్యాక్సీన్ ప్రభావవంతంగా ఉందో లేదో తెలుసుకోవాలని పరిశోధకులు భావిస్తున్నారు. ఏదేమైనా, లాక్ డౌన్ విజయం ఒక పొరపాటును రుజువు చేస్తుంది. కరోనావైరస్ కేసుల సంఖ్య తగ్గిపోయినట్టుగా, వ్యాక్సీన్ ప్రభావవంతంగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. వేగంగా సమాధానాల కోసం ఉద్దేశపూర్వకంగా ప్రజలకు వ్యాపించడమనేది సురక్షితమా కాదా అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి.
ప్రభుత్వం ఏం చేస్తోంది? :
వ్యాక్సిన్ వేగంగా అభివృద్ధి చెందడానికి, తయారీకి తోడ్పడటానికి ప్రభుత్వం కరోనావైరస్ టాస్క్‌ఫోర్స్‌ను రూపొందించింది. బిజినెస్ సెక్రటరీ అలోక్ శర్మ మాట్లాడుతూ.. వ్యాక్సీన్ అభివృద్ధి అనేది భారీ ప్రయత్నమని, దీనికి ఎటువంటి హామీలు ఇవ్వలేమన్నారు. కానీ ప్రభుత్వం మన శాస్త్రవేత్తలకు మద్దతు ఇస్తోందని ఆయన చెప్పారు. 21 కొత్త పరిశోధన ప్రాజెక్టులకు నిధులు సమకూరుస్తోంది. తయారీని పెంచడానికి కృషి చేస్తోంది. ఒక వ్యాక్సిన్‌ను భారీ పరిమాణంలో ఉత్పత్తి చేయవచ్చునని అలోక్ శర్మ అభిప్రాయపడ్డారు.
విజయవంతమైన వ్యాక్సిన్ ఎక్కడి నుంచైనా రాగలదని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యమని టాస్క్‌ఫోర్స్‌కు సారథ్యం వహించే చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్ Sir Patrick Vallance అన్నారు. UK ప్రభుత్వానికి, ప్రపంచ ఆరోగ్య సంస్థకు సలహా ఇచ్చే శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం.. వ్యాక్సీన్ కోసం 12-18 నెలల సమయం పట్టొచ్చు.
Also Read | లాక్ డౌన్ : గుజరాత్ లో చిక్కుకుపోయిన తెలుగు జాలర్లు