Dad Punishment: కూతురు చేసిన పనికి.. తండ్రి ఇలా బుద్ధి చెప్పాడు.. నెటిజన్ల హర్షం

పిల్లలను హింసించే తల్లిదండ్రుల ప్రవర్తన పట్ల ఇంటర్నెట్లో విమర్శలు వస్తుంటాయి. తన కుమార్తె విషయంలో తండ్రి చేసిన పనిని రెడిట్ నెటిజన్లు సమర్థిస్తున్నారు

Dad Punishment: కూతురు చేసిన పనికి.. తండ్రి ఇలా బుద్ధి చెప్పాడు.. నెటిజన్ల హర్షం

Dad Shaves Daughter's Head As Punishment For Bullying A Teen With Cancer (1)

Updated On : August 21, 2021 / 12:42 PM IST

Dad Shaves Daughter’s Head as Punishment : పిల్లలను హింసించే తల్లిదండ్రుల ప్రవర్తన పట్ల ఇంటర్నెట్లో నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతుంటాయి. కానీ, తన కుమార్తె విషయంలో తండ్రి చేసిన పనిని రెడిట్ నెటిజన్లు సమర్థిస్తున్నారు. అందుకో మంచి కారణం ఉంది.. తన 16ఏళ్ల కూతురికి తండ్రి గుండు చేశాడు. తలపై జట్టును మొత్తం ట్రిమ్మర్ తో క్లీన్ సేవ్ చేశాడు. తన మాజీ భార్య కూతురు చేసిన పనికి తాను ఇలా బుద్ధి చెప్పాల్సి వచ్చిందట.. భార్య నుంచి విడిపోయినప్పటికీ పిల్లల బాధ్యత విషయంలో వారిద్దరి భాగస్వామ్యం ఉంటుంది. మాజీ భార్య కూతురికి గార్డియన్ గా ఉన్నాడు.

పిల్లలపై బాధ్యతతో పాటు వారు అందరితో సత్ ప్రవర్తనతో మెలిగే ఉండేలా బుద్ధులు నేర్పాలి. తల్లిదండ్రులుగా పిల్లలను ప్రేమగా చూసుకుంటేనే వారు తప్పు చేస్తే మందలించాలి. లేదంటే తప్పుడు మార్గంలో వెళ్లి అనేక సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. ఈ తండ్రి కూడా తన కుమార్తె విషయంలో అలానే బుద్ధిచెప్పాడు. తనతో పాటు స్కూళ్లో చదువుకునే తోటి విద్యార్థిని కేన్సర్ వ్యాధితో బాధపడుతోంది. దాంతో ఆమె తలపై జుట్టుంతా రాలిపోయింది. కానీ, ఈ 16ఏళ్ల అమ్మాయి మాత్రం తోటి స్నేహితురాలిని పదేపదే వేధింపులు, ఎగతాళి చేస్తోంది. అంతేకాదు.. జుట్టు కోల్పోయిన బాధిత బాలిక తలపై విగ్ ను కూడా లాగిపారేసింది.

ఆ విషయం తెలిసిన తండ్రి తన కూతురికి ఆ బాధ ఏంటో తెలియజెప్పాలనుకున్నాడు. ఏ జుట్టు లేదని అవహేన చేసిందో అలానే తనకు కూడా జుట్టంతా కట్ చేశాడు. కూతురు తన ప్రవర్తన మార్చుకోవాలని చెబితి వినలేదు. దాంతో తనకు ఇలా గుండు గీసి శిక్షించాలనుకున్నాడు. ఆమెకు రెండు ఆప్షన్లు ఇచ్చాడు.

అందులో ఒకటి తన సెల్ ఫోన్లు, అన్నింటిని వదులుకోవాలన్నాడు. తిరిగి ఇచ్చేది లేదన్నాడు. రెండో ఆప్షన్ గుండు చేయించుకోవాలన్నాడు. దీనికి కూతురు అంగీకరించింది. అలా తన కూతురికి బుద్ధి చెప్పాడా తండ్రి. పిల్లల పట్ల ప్రేమనే కాదు.. అవసరమైతే వారిని సక్రమైన దారిలో పెట్టేందుకు కొన్నిసార్లు కఠినంగా కూడా ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేశాడు. గొప్ప తండ్రి అంటూ నెటిజన్లు కూడా అతడికి సలాం కొడుతున్నారు.