America: డెయిరీ ఫాంలో భారీ పేలుడు.. 18,000 గోవులు మరణం

పేలుడుకు గల ఖచ్చితమైన కారణం ఇంకా వెల్లడి కానప్పటికీ.. గ్ఫెల్లర్ వ్యవసాయ పరికరాలలో ఒక లోపం కారణంగా పేలుడు సంభవించి ఉండవచ్చని, అదే అగ్నిప్రమాదానికి కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. గాయపడిన ఆవులలో చాలా వరకు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని, వాటిని తొందర్లోనే ప్రాణాలు తీసేసి పూడ్చిపెట్టవచ్చని తెలిపారు

America: డెయిరీ ఫాంలో భారీ పేలుడు.. 18,000 గోవులు మరణం

Dairy Farm explosion in USA

Updated On : April 13, 2023 / 9:06 PM IST

America: అమెరికాలోని ఒక డెయిరీ ఫాంలో భారీ పేలుడు సంభవించి సుమారు 18,000 గోవులు చనిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. టెక్సాస్ పాన్‌హ్యాండిల్‌లోని డెయిరీ ఫామ్‌లో సోమవారం ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డట్టు తెలిసింది. అయితే పేలుడు సంభవించడానికి గల కచ్చితమైన కారణం ఇంకా తెలియలేదని స్థాని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం నుంచి ఒక మహిళా ఉద్యోగి అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడిందట. అయితే వేల సంఖ్యలో మరణించిన ఈ గోవులను టెక్సాస్ రాష్ట్ర ప్రభుత్వం, అమెరికా డెయిరీ అధికారులు పూడ్చిపెట్టే పనిలో నిమగ్నమై ఉన్నట్లు వెల్లడించారు.

Supreme Court: ఎన్నికలకు ముందు బీజేపీకి ఎదురుదెబ్బ.. ముస్లిం రిజర్వేషన్లపై బొమ్మై ప్రభుత్వాన్ని తప్పు పట్టిన సుప్రీంకోర్టు

డిమిట్‌లోని సౌత్‌ఫోర్క్ డైరీ ఫాంలో పేలుడు సంభవించినప్పుడు పాలు పితికి ఆవులు విశ్రాంతి తీసుకుంటున్నాయని కాస్ట్రో కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఫాక్స్ న్యూస్ డిజిటల్‌తో ధృవీకరించింది. ఈ ప్రమాదం నుంచి కొన్ని ఆవులు బయటపడ్డాయని, అయితే పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. చనిపోయిన జంతువుల కచ్చితమైన సంఖ్య తెలియదని, అయితే పేలుడు అనంతరం 18,000 ఆవులు చనిపోయాయని ప్రాథమిక నివేదికలు సూచించినట్లు షెరీఫ్ సాల్ రివెరా అన్నారు.

Hyderabad Traffic Restrictions : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు

పేలుడుకు గల ఖచ్చితమైన కారణం ఇంకా వెల్లడి కానప్పటికీ.. గ్ఫెల్లర్ వ్యవసాయ పరికరాలలో ఒక లోపం కారణంగా పేలుడు సంభవించి ఉండవచ్చని, అదే అగ్నిప్రమాదానికి కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. గాయపడిన ఆవులలో చాలా వరకు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని, వాటిని తొందర్లోనే ప్రాణాలు తీసేసి పూడ్చిపెట్టవచ్చని తెలిపారు. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు డెయిరీ ఫామ్‌కు వచ్చినప్పుడు, డెయిరీ భవనంలో కేవలం ఒక మహిళ మాత్రమే చిక్కుకుందని వారు నిర్ధారించారు. చిక్కుకుపోయిన వ్యక్తిని భవనం నుండి రక్షించి, చికిత్స కోసం లుబ్బాక్‌లోని యూఎంసీ ఆసుపత్రికి విమానంలో తరలించినట్లు అధికారులు తెలిపారు.