Hyderabad Traffic Restrictions : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు

Hyderabad Traffic Restrictions : లక్డీకాపూల్ నుంచి ట్యాంక్ బండ్, లిబర్టీ వైపు వెళ్లే వాహనాలు తెలుగు తల్లి ఫ్లైఓవర్, లోయర్ ట్యాంకు బండ్ వైపు మళ్లింపు.

Hyderabad Traffic Restrictions : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు

Hyderabad Traffic Restrictions (Photo : Google)

Hyderabad Traffic Restrictions : అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా హైదరాబాద్ నగరంలో పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు. రేపు(ఏప్రిల్ 14) మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8గంటల వరకు వాహనాల దారి మళ్లింపు ఉంటుంది. నెక్లెస్ రోడ్డు, ఖైరతాబాద్, లక్డీకాపూల్, తెలుగు తల్లి జంక్షన్ రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి.

* నెక్లెస్ రోడ్డు – ఎన్టీఆర్ మార్గ్ – తెలుగుతల్లి జంక్షన్ వైపు వాహనాలకు నో ఎంట్రీ.
* పంజాగుట్ట, సోమాజీగూడ, ఖైరతాబాద్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే వాహనాలు షాదన్ కళాశాల మీదుగా దారి మళ్లింపు.
* సంజీవయ్య పార్కు, నెక్లెస్ రోడ్డు నుంచి ఎన్టీఆర్ మార్గ్, ఖైరతాబాద్ వైపు వెళ్లే వాహనాలు రాణిగంజ్ మీదుగా తరలింపు.
* లక్డీకాపూల్ నుంచి ట్యాంక్ బండ్, లిబర్టీ వైపు వెళ్లే వాహనాలు తెలుగు తల్లి ఫ్లైఓవర్, లోయర్ ట్యాంకు బండ్ వైపు మళ్లింపు.

Also Read..Hyderabad Metro: మెట్రో ప్రయాణికుల పార్కింగ్ కష్టాలు.. ట్రాఫిక్ చలాన్లతో బెంబేలు

* ట్యాంక్ బండ్, బీఆర్కే భవన్, తెలుగుతల్లి జంక్షన్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే వాహనాలు లక్డీకాపూల్ వైపు మళ్లింపు.
* మింట్ కాంపౌండ్, నెక్లెస్ రోటరీ మార్గాల మూసివేత.
* ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, లుంబినీ పార్కులు మూసివేత.
* ఖైరతాబాద్, సైఫాబాద్, రవీంద్ర భారతి, మింట్ కాంపౌండ్, నల్లగుట్ట, లోయర్ ట్యాంక్ బండ్, లిబర్టీ, తెలుగు తల్లి సిగ్నళ్ల వద్ద భారీ వాహనాల రద్దీ ఉండే అవకాశం.

Also Read..TSRTC: హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వారికి గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ

* ప్రత్యామ్నయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు సూచన. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సోషల్ మీడియాను అనుసరించాలని చెప్పారు. ఏదైనా అత్యవసరం ఉంటే ట్రాఫిక్ కంట్రోల్ హెల్ప్ లైన్ నెంబర్ 9010203626 కు ఫోన్ చేయాలని పోలీసులు సూచించారు.