TSRTC: హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వారికి గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ

విజయవాడ మార్గంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వారికి ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో సూపర్‌ లగ్జరీ, రాజధాని ఏసీ సర్వీసుల్లో 10 శాతం రాయితీ కల్పించాలని సంస్థ నిర్ణయించింది. విజయవాడ మార్గం వరకు ఈ రాయితీ వర్తిస్తుంది. ఉదాహరణకు ఒక ప్రయాణికుడు రాజధాని ఏసీ సర్వీస్‌లో హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లాలనుకుంటే.. ఆయన టికెట్‌లో విజయవాడ వరకు 10 శాతం రాయితీ కల్పించడం జరుగుతుంది

TSRTC: హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వారికి గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ

TSRTC Bus

TSRTC: ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు హైదరాబాద్‌-విజయవాడ రూట్‌లో 10 శాతం రాయితీ కల్పించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) నిర్ణయించింది. ఆ రూట్‌లో నడిచే సూపర్‌ లగ్జరీ, రాజధాని ఏసీ సర్వీసుల్లో రానుపోనూ ఈ రాయితీ వర్తించనుంది. ఈ నెల 30 వరకు 10 శాతం డిస్కౌంట్‌ అమల్లో ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్‌ మార్గాల్లో వెళ్లే ప్రయాణికులకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది.

Karnataka Elections: బీజేపీలో చేరితేనే తన బిడ్డను కాపురానికి పంపిస్తానంటూ అల్లుడికి ఝలక్ ఇచ్చిన మామ.. ఎక్కడంటే..?

”విజయవాడ మార్గంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వారికి ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో సూపర్‌ లగ్జరీ, రాజధాని ఏసీ సర్వీసుల్లో 10 శాతం రాయితీ కల్పించాలని సంస్థ నిర్ణయించింది. విజయవాడ మార్గం వరకు ఈ రాయితీ వర్తిస్తుంది. ఉదాహరణకు ఒక ప్రయాణికుడు రాజధాని ఏసీ సర్వీస్‌లో హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లాలనుకుంటే.. ఆయన టికెట్‌లో విజయవాడ వరకు 10 శాతం రాయితీ కల్పించడం జరుగుతుంది. ఆ రాయితీ వల్ల ఒక్కో ప్రయాణికుడికి రూ.40 నుంచి 50 వరకు ఆదా అవుతుంది. ఈ నెల ౩౦ వరకు అందుబాటులో ఉండే ఈ రాయితీ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలి.” అని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు. రిజర్వేషన్‌ కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌ www.tsrtconline.com ను సంప్రదించాలని వారు సూచించారు.

Karnataka: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో చిత్రమైన హామీలు.. ఆసక్తికర విన్యాసాలు

అలాగే ముందస్తు రిజర్వేషన్‌ చేసుకునే ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ రాయితీ కల్పిస్తోందని గుర్తు చేశారు. 31 నుంచి 44 రోజుల మధ్యలో అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకుంటే 5 శాతం, 45 నుంచి 60 రోజుల మధ్యలో రిజర్వేషన్‌ చేసుకుంటే 10 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్‌ నంబర్లు 040-69440000, 23450033 ను సంప్రదించాలన్నారు.