Karnataka Elections: బీజేపీలో చేరితేనే తన బిడ్డను కాపురానికి పంపిస్తానంటూ అల్లుడికి ఝలక్ ఇచ్చిన మామ.. ఎక్కడంటే..?

బీజేపీ కార్యకర్త చంద్రు మాత్రం తన అల్లుడు పరశురాముడుకు ఎలాంటి షరతు విధించలేదని చెప్పారు. మా అల్లుడు కాంగ్రెస్ లో ఉన్నాడని, నేను బీజేపీలో ఉన్నానని మా మధ్య ఎప్పుడూ పార్టీల ప్రస్తావన రాలేదని చెప్పాడు.

Karnataka Elections: బీజేపీలో చేరితేనే తన బిడ్డను కాపురానికి పంపిస్తానంటూ అల్లుడికి ఝలక్ ఇచ్చిన మామ.. ఎక్కడంటే..?

Karnataka Elections

Karnataka Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. మే 10న పోలింగ్ జరుగుతుంది. 13న ఫలితాలు వెల్లడవుతాయి. గురువారం (ఏప్రిల్ 13వ తేదీ) నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే ఆయా పార్టీలు చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాయి. మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటనకు కసరత్తు చేస్తున్నాయి. సీట్లు దక్కించుకున్న అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో వేగం పెంచారు. ఇంటింటికి వెళ్తూ, ర్యాలీలు నిర్వహిస్తూ ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ కోలాహలం నెలకొంది.

Karnataka Election: 23మంది అభ్యర్థులతో బీజేపీ రెండో జాబితా విడుదల.. జగదీష్ షెట్టర్‌కు దక్కని చోటు..

ఒకపక్క రాజకీయ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య కర్ణాటకలో ప్రచారహరు జోరందుకుంటుంది. ఇలాంటి తరుణంలో ఓ తండ్రి తన బిడ్డను కాపురానికి పంపించేందుకు అల్లుడికి షరతు పెట్టారు. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరితేనే తన బిడ్డను కాపురానికి పంపిస్తానంటూ చెప్పాడు. స్థానికంగా అల్లుడికి మామ పెట్టిన షరతు సంచలనంగా మారింది. అయితే, బీజేపీ పెద్దల వరకు ఈ విషయం వెల్లడంతో వారి జోక్యంతో వివాదం సర్దుమణిగినట్లు తెలుస్తోంది.

Karnataka Elections 2023 : బీజేపీ తొలి జాబితా విడుదల.. 52మంది కొత్త వారికి అవకాశం, పోటీ నుంచి తప్పుకున్న మాజీ సీఎం

కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా హునాసాగి తాలూకా సోనాపూర్‌ తండాలో చంద్రు అనే బీజేపీ కార్యకర్త ఉన్నాడు. అదే తండాలో నివాసం ఉంటున్న అతని అల్లుడు పరశురామ కాంగ్రెస్ కార్యకర్త. పరశురామ భార్య గర్భవతి కావడంతో రెండు నెలల క్రితం బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తరువాత పుట్టింటికి వెళ్లింది. కొద్దిరోజుల తరువాత తన భార్యను పంపించాలని మామ చంద్రు (పరుశురామ భార్య తండ్రి)ను పరుశురామ కోరాడు. అందుకు చంద్రు నిరాకరించాడు. నువ్వు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరాలని అప్పుడే నా బిడ్డను నీతో పంపిస్తానని, లేకుంటే పంపించనని అల్లుడికి ఝలక్ ఇచ్చాడు. అందుకు పరశురామ ససేమీరా అనడంతో వివాదం తలెత్తింది. ఒకవేళ నేను కాంగ్రెస్ ను వీడాలంటే నువ్వు కూడా బీజేపీని వీడాలని పరుశురామ మామ చంద్రుకు షరతు పెట్టాడు. అందుకు అంగీకారం కాలేదు.

Karnataka Elections 2023: మేము ఇతర పార్టీల్లా కాదు.. బీజేపీ ఈ ప్రయోగాలు చేస్తోంది: సీటీ రవి

మామ, అల్లుడి మధ్య వివాదం కాస్తా స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక బీజేపీ పెద్దలు చంద్రుకు సర్దిచెప్పడంతో వివాదం సర్దుదమణిగింది. అయితే, బీజేపీ కార్యకర్త చంద్రు మాత్రం తన అల్లుడు పరశురాముడుకు ఎలాంటి షరతు విధించలేదని చెప్పారు. మా అల్లుడు కాంగ్రెస్ లో ఉన్నాడని, నేను బీజేపీలో ఉన్నానని మా మధ్య ఎప్పుడూ పార్టీల ప్రస్తావన రాలేదని అన్నారు. మరికొద్ది రోజుల్లో తన కూతురిని అత్తవారింటికి పంపిస్తానని చంద్రు చెప్పడం గమనార్హం.