Karnataka Elections 2023 : బీజేపీ తొలి జాబితా విడుదల.. 52మంది కొత్త వారికి అవకాశం, పోటీ నుంచి తప్పుకున్న మాజీ సీఎం

Karnataka Elections 2023: తొలి జాబితాలో పలువురు ఐపీఎస్ లకు చోటు దక్కింది. 32మంది ఓబీసీ, 30మంది ఎస్సీ, 16 మంది ఎస్టీ అభ్యర్థులకు చోటు దక్కింది.

Karnataka Elections 2023 : బీజేపీ తొలి జాబితా విడుదల.. 52మంది కొత్త వారికి అవకాశం, పోటీ నుంచి తప్పుకున్న మాజీ సీఎం

Karnataka Elections 2023

Karnataka Elections 2023 : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి.. బీజేపీ.. అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. మొత్తం 189 అభ్యర్థులతో తొలి జాబితాను బీజేపీ రిలీజ్ చేసింది. తొలి జాబితాలో 52మంది కొత్త వారికి అవకాశం కల్పించింది. 32మంది ఓబీసీ, 30మంది ఎస్సీ, 16 మంది ఎస్టీ అభ్యర్థులకు చోటు దక్కింది.

Also Read..Subramanian Swamy: కేంద్ర హోంమంత్రిగా అమిత్ షాకు అర్హత లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి

తొలి జాబితాలో పలువురు ఐపీఎస్ లకు చోటు దక్కింది. ఇక సింగం నియోజకవర్గం నుంచి సీఎం బసవరాజు బొమ్మై పోటీ చేస్తున్నారు. ఈసారి మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప పోటీకి దూరంగా ఉన్నారు. ఆయన బదులు షికారిపుర నియోజకవర్గం నుంచి ఆయన కొడుకు విజయేంద్ర పోటీ చేస్తున్నారు.

Also Read..Karnataka Elections 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి ఎదురుదెబ్బ

కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 113 సీట్లలో గెలవాల్సి ఉంటుంది. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. ఆ మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.