Earthquake : నేపాల్‌లో మళ్లీ తాజాగా భూకంపం…ప్రజల కలకలం

నేపాల్ దేశంలో ఆదివారం తెల్లవారుజామున మళ్లీ భూకంపం సంభవించింది. శనివారం రాత్రి సంభవించిన భారీ భూకంపం వల్ల 157 మంది మరణించిన ఘటన రెండో రోజే మళ్లీ నేపాల్ దేశాన్ని భూప్రకంపనలు వణికించాయి....

Earthquake : నేపాల్‌లో మళ్లీ తాజాగా భూకంపం…ప్రజల కలకలం

Nepal Earthquake

Updated On : November 5, 2023 / 7:23 AM IST

Earthquake : నేపాల్ దేశంలో ఆదివారం తెల్లవారుజామున మళ్లీ భూకంపం సంభవించింది. శనివారం రాత్రి సంభవించిన భారీ భూకంపం వల్ల 157 మంది మరణించిన ఘటన రెండో రోజే మళ్లీ నేపాల్ దేశాన్ని భూప్రకంపనలు వణికించాయి. ఆదివారం తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 3.6 తీవ్రతతో మరో భూకంపం హిమాలయ దేశాన్ని వణికించింది. ఖాట్మండుకు 169 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో ఆదివారం తెల్లవారుజామున 4.38 గంటల సమయంలో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.

Also Read : Onions : మొబైల్ వాహనాల్లో సబ్సిడీ ఉల్లి విక్రయం…కిలో ధర ఎంతంటే…

శనివారం అర్థరాత్రి నేపాల్‌లో రిక్టర్ స్కేల్‌పై 6.4 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించిన తర్వాత ఇది జరిగింది. నేపాల్ లో శనివారం మధ్యాహ్నం కూడా 3.3 తీవ్రతతో అదనపు భూప్రకంపనలు సంభవించాయి. శనివారం వచ్చిన భారీ భూకంపం వల్ల ఆస్తినష్టం, ప్రాణనష్టం జరిగాయని నేపాల్ ప్రధానమంత్రి పుష్పకమల్ చెప్పారు.

Also Read : Khalistani terrorist : నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దు…ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ తాజా హెచ్చరిక

ప్రభుత్వం హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ కార్యకలాపాలను నిర్వహించడానికి నేపాల్ సైన్యం, నేపాలీ సెంటినెల్, సాయుధ పోలీసు బలగాలను రంగంలోకి దింపింది. క్షతగాత్రులను హెలికాప్టరులో ఆసుపత్రులకు తరలించి వైద్య సహాయం అందించారు. నేపాల్ భూకంపం తర్వాత భారతదేశం పౌరుల కోసం హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేసింది. నేపాల్‌లో సంభవించిన భూకంపం వల్ల సంభవించిన ప్రాణనష్టం, అపార నష్టంపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Also Read : Earthquake: అఫ్ఘానిస్థాన్‌లో మళ్లీ భూకంపం తీవ్రత ఎంతంటే…అయోధ్యలోనూ భూప్రకంపనలు

ప్రధాని మోదీ నేపాల్‌కు మద్దతును అందించారు. భూకంపం బారిన పడిన నేపాల్ దేశానికి సాధ్యమైన అన్ని రకాల సహాయాన్ని అందించడానికి భారతదేశం సుముఖత వ్యక్తం చేసింది. భూకంపం ప్రభావం ఒక్క నేపాల్‌కే పరిమితం కాలేదు. ఢిల్లీ-ఎన్‌సిఆర్, ఉత్తరప్రదేశ్, బీహార్‌తో సహా ఉత్తర భారతదేశంలోని పలు జిల్లాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి.