పిచ్చ గిరాకీ అంట‌ : ఇక్క‌డ‌ అస్థి పంజరాలు అమ్మబడును

పిచ్చ గిరాకీ అంట‌ : ఇక్క‌డ‌ అస్థి పంజరాలు అమ్మబడును

శవాలను పూర్తిగా కాలనీయకుండానే అమ్మేసుకుంటున్నారు. స్మశానంలో వదిలేసి వెళ్లిన మృతదేహాలపై బేరాలు. పుర్రెకు రూ.1000, ఎముకలకు రూ.500 ఇది ప్రాథమిక ధర మాత్రమే. డిమాండ్‌ను బట్టి విదేశాలకు రూ.50వేల వరకూ పలుకుతాయట. ప్రపంచ వ్యాప్తంగా విదేశాలకు ఎగుమతి అవుతున్న అస్థిపంజరాలలో భారతదేశానికి చెందినవే ఉండటం శోచనీయం.

జపాన్‌లోని టోక్యో నగరంలో సాధారణ చెకింగ్‌లో భాగంగా ఓ ఇంట్లో అస్థిపంజరాలను కనుగొన్నారు పోలీసులు. షాక్ గురైన వారు వివరాల కోసం ఇళ్లు మొత్తం సోధా చేయగా గార్డెన్‌లో మరిన్ని ఎముకలు కనిపించాయట. అయితే వాటిని జంతువులవేమోనని అపోహపడగా, ప్రాథమిక పరీక్షల అనంతరం అవన్నీ మనుషులకు సంబంధించిన ఎముకలే అని తేలింది. 

వెంటనే సమాచారం జపాన్‌లోని హబ్బా స్కెలిటన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు తెలియజేశారు. రంగంలోకి దిగిన ప్రెసిడెంట్ తనిఖీలు నిర్వహించి నిందితుడిని అరెస్టు చేశారు. అస్థిపంజరాలను పలు చోట్ల నుంచి సేకరించాడని భావించి విచారణ మొదలుపెట్టిన వారికి ఊహించని విషయం బయటికి వచ్చింది. నవంబరు 2018లో స్కూళ్లకు, ల్యాబరటరీలకు అస్థిపంజరాలు పంపింది. వీటన్నిటనీ ఓ కంపెనీ పర్యవేక్షించింది. 

ఆరంభంలో కొన్ని మాత్రమే ఉన్న అస్థి పంజరాలు కొద్ది రోజుల్లోనే 500కు పైగా చేరాయి. నిజానికి 1970లలోనే అనాటమిక్ విద్య కోసం మనిషి అస్థిపంజరాలను నిషేదించింది జపాన్ ప్రభుత్వం. ఇందుకోసం అప్పటి నుంచి కృత్రిమ అస్థిపంజరాలనే వాడుతున్నారు. ఇదే సందర్భంలో భారత్ 1985లో అస్థిపంజరాల ఎగుమతిని నిలిపివేశారు. కాకపోతే, విదేశాల్లో గిరాకీ బాగా ఉండటంతో ఇప్పటికీ అక్రమంగా అస్థిపంజరాలను అమ్మేస్తున్నారు. 

ఎక్కడి నుంచో తెలుసా:
నిరక్షరాస్యులు, పేద వారు ఉండే ప్రాంతాలలోని స్మశానంలో శవాలు కాల్చేవారితో ముందుగా సంప్రదిస్తారు. శవాన్ని కాల్చడానికి ముందే కెమికల్స్‌ను మృత దేహాలకు పూస్తారు. చితికి నిప్పు అంటించి అంతా వెళ్లిపోగానే అస్థిపంజరాలను వేరు చేస్తారు. 

ఎక్కడ అమ్ముతారంటే:
విదేశాల్లో వీటికి పిచ్చ గిరాకీ. థాయ్‌లాండ్, బ్రెజిల్, యూఎస్ ప్రాంతాల్లో వీటిని వేలు ధారపోసి కొనుక్కుంటారు. 

ధర ఎంతంటే:
స్మశానంలో నుంచి పుర్రెలను రూ.1000-రూ.2000 అమ్ముతారు. అదే ఎముకల కోసమైతే రూ.500-రూ800వరకూ పలుకుతాయి. ఆ తర్వాత బ్రోకర్ దానిని రూ.10వేల నుంచి రూ.20వేల మధ్య ధరకు అమ్మేస్తాడు. ఒకసారి పశ్చిమబెంగాల్ బోర్డర్ దాటి బయటకు వెళ్లగానే రూ.40వేల నుంచి 50వేల వరకూ అమ్మేసుకుంటారు.