రెండో ప్రపంచ యుద్ధం బాంబు దాడుల నుంచి బైటపడ్డ 84ఏళ్ల మొసలి మృతి

రెండవ ప్రపంచ యుద్ధం నుంచి ప్రాణాలతో బైటపడిన 84 ఏళ్ల మొసలి శుక్రవారం (మే 22,2020)న రష్యా జూలో మృతి చెందింది. అమెరికాలో జన్మించిన మిసిసిప్పీ అలిగేటర్ శాటర్న్ అనే మొసలిని 1936లో బెర్లిన్ జూకు తరలించారు. 1943లో జరిగిన రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆ జూపై బాంబు దాడులు జరిగాయి. ఆ దాడుల నుంచి ఆ మొసలి తప్పించుకుంది. రెండో ప్రపంచ యుద్ధంలో బెర్లిన్ మీద బాంబుల వర్షం కురిసినపుడు బతికి బయటపడ్డ ఈ మొసలి నాజీ నేత అడాల్ఫ్ హిట్లర్ పెంపుడు మొసలి అనే వదంతులు కూడా ఉన్నాయి.
ఈ మొసలిని అమెరికా బెర్లిన్ జూకు బహుమతిగా ఇచ్చింది. 1943లో ఈ నగరంపై జరిగిన బాంబుపేలుళ్ల నుంచి అది క్షేమంగా తప్పించుకోగలిగింది. మూడేళ్ల తర్వాత ఆ మొసలిని కనిపెట్టిన బ్రిటిష్ సైనికులు దాన్ని సోవియట్ యూనియన్‌కు అప్పగించారు.ఆ మూడేళ్లపాటు ఆ మొసలి ఎలా బతికి ఉంది? అనే విషయంపై మిస్టరీ ఇంకా వీడలేదు. 1946 జులై నుంచి ఈ మొసలి మాస్కోలో ఉన్న జూలో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది
శాటర్న్ ను 74 ఏళ్ల పాటు క్షేమంగా సంరక్షించిన అరుదైన అవకాశం.. గౌరవం మాస్కో జూకు దక్కిందని అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..శాటర్న్ ఒక యుగం అంటే అతిశయోక్తి కాదనీ అన్నారు. అంతేకాదు..బహుకాలంపాటు బతికిన శాటర్న్ తనను సంరక్షించేవారిని చక్కగా గుర్తుపట్టేదని..వారితో బ్రష్‌తో చక్కగా మసాజ్ చేయించుకోవడం అంటే దానికి చాలా ఇష్టమని జూ అధికారులు తెలిపారు.
ఎక్కువ కాలం బతికిన అలిగేటర్
మిసిసిపీ అలిగేటర్లు అడవుల్లో 30 నుంచి 50 ఏళ్ల వరకూ జీవిస్తాయి. కానీ శాటర్న్ మాత్రం ప్రపంచంలో ఎక్కువకాలం బతికిన అలిగేటర్‌గా చరిత్ర సృష్టించిందనీ అన్నారు. సెర్బియా జూలో ఉన్న మూజా అనే మరో మగ అలిగేటర్ కూడా ఇప్పుడు 80 సంవత్సరంలో ఉందని అది ఆరోగ్యంగానే ఉందనీ..కానీ ఏ మిసిసిపీ అలిగేటర్ అయినా శాటర్న్ బతికినంత కాలం అదిబతికి ఉండటం కష్టమేనన్నారు.
ఇది హిట్లర్ మొసలి కాదు జంతువులతో రాజకీయం తగదు..
సాటర్న్ హిట్లర్ పెంపుడు మొసలి అనే పుకార్లు వచ్చాయనీ..కానీ ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. ఈ పుకారు ఎలా ప్రారంభమైందో తెలియదు.జంతువులతో రాజకీయం చేయకూడదు. మనుషుల పాపాలను వాటికి అంటించకూడదని అన్నారు. కానీ శాటర్న్ 1943లో బాంబు దాడుల నుంచి ఎలా తప్పించుకుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఏది ఏమైనా..ఎవరు ఎన్ని అనుకున్నా..అరుదైన సాటర్న్ కు ఇంతకాలం జీవించి ఉండాలని ఉంటే అది బాంబు దాడుల నుంచి తప్పించుకుని ఉండవచ్చు.
Read: ఆరు అంతస్థులపై నుంచి వేలాడుతున్న బాలికను కాపాడిన వ్యక్తి