Qatar Airways : ఢిల్లీ నుంచి దోహా వెళుతున్న విమానం కరాచీలో అత్యవసర ల్యాండింగ్

దేశ రాజధాని ఢిల్లీ నుంచి దోహా వెళ్ళాల్సిన విమానం కరాచీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.

Qatar Airways : ఢిల్లీ నుంచి దోహా వెళుతున్న విమానం కరాచీలో అత్యవసర ల్యాండింగ్

Qatar Airways

Updated On : March 21, 2022 / 11:58 AM IST

Qatar Airways :  దేశ రాజధాని ఢిల్లీ నుంచి దోహా వెళ్ళాల్సిన విమానం కరాచీ విమానాశ్రయంలో అత్యవసరంగా  ల్యాండ్ అయ్యింది. ఖతార్ ఎయిర్ వేస్ కు చెందిన QR579 విమానాన్ని కరాచీలో అత్యవసరంగా దింపినట్లు అధికారులు తెలిపారు.

విమానంలోని కార్గో ప్రాంతంలో పొగలు  రావటం గమనించిన  సిబ్బంది  వెంటనే సమీపంలోని కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.  విమానంలో సుమారు 100 మంది ప్రయాణికులు ఉన్నారు. అంతా సురక్షితంగా ఉన్నట్లు సంస్ధ  తెలిసింది.

ప్రయాణికులను కిందకు దింపి సమస్యను పరిష్కరిస్తున్నారు. ఢిల్లీ నుంచి తెల్ల‌వారుజామున 3.50 నిమిషాల‌కు విమానం బ‌య‌లుదేరింది. ఆ త‌ర్వాత అది క‌రాచీలో 5.30 నిమిషాల‌కు ల్యాండ్ అయ్యింది. దోహా నుంచి క‌నెక్టింగ్ ఫ్ల‌యిట్ ఉన్న ప్ర‌యాణికులు అందులో ఉన్నారు.
Also Read : Covid-19 Update : దేశంలో కొత్తగా 1,549 కోవిడ్ కేసులు నమోదు
ప్రయాణికులు దోహా వెళ్లటానికి రిలీఫ్ ప్లైట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఖతార్ ఎయిర్ వేస్ తెలిపింది. ఘటనపై దర్యాప్తు జరుగుతుందని…. ప్రయాణికులకు  కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ఖతార్ ఎయిర్ వేస్ ప్రకటించింది.