Delivery Boy Kiss woman customer : మహిళా కస్టమర్‌ని ముద్దు పెట్టుకోబోయిన డెలివరీ బోయ్ .. కట్ చేస్తే..

ఆర్డర్ చేసిన సరుకులు పట్టుకొచ్చిన డెలివరీ బాయ్ మహిళా కస్టమర్ ను ముద్దు పెట్టుకోబోయాడు.దానికి ఆమె ఏం చేసిందంటే..

Delivery Boy Kiss woman customer : మహిళా కస్టమర్‌ని ముద్దు పెట్టుకోబోయిన డెలివరీ బోయ్ .. కట్ చేస్తే..

Delivery Boy Kiss woman cutomer _

Updated On : November 25, 2022 / 4:19 PM IST

Delivery Boy Kiss woman customer : ఇలా ఫుడ్ గానీ కూరగాయలు ఇతర వస్తువులు ఆర్డర్ ఇస్తే అలా పట్టుకొచ్చి మర్యాదగా ఇచ్చేస్తారు డెలివరీ బాయ్స్. సార్ లేదా మాడమ్ అంటూ వినయంగా..మర్యాదగా పలకరించి మరీ ఇస్తారు. కానీ ఓ డెలివరీ బాయ్ మాత్రం ఓ మహిళ ఆర్డర్ ఇచ్చిన సరుకులు పట్టుకొచ్చి విచిత్రంగా ప్రవర్తించాడు.

బ్రిటన్‌లోని మెరిడెన్ ఎస్టేట్‌లో నివసిస్తున్న 33 ఏళ్ల మహిళ ఆన్‌లైన్లో కొన్ని సరుకులు ఆర్డర్‌ పెట్టింది.కాసేపటికి ఇంటి కాలింగ్ బెల్ మోగగానే మహిళ వెళ్ళి తలుపులు తీసింది. ఎదురుగా తను ఆర్డర్ పెట్టిన సరుకులు పట్టుకొని డెలివరీ బాయ్ గుమ్మంలో నిలబడి ఉన్నాడు. సదరు డెలివరీ బాయ్ కు 60 ఏళ్లు. డెలివరీ చేసేవారిని బాయ్స్ అని ఎందుకంటారో మరి..! ఇదంతా పక్కన పెడితే సదరు డెలివరీ బాయ్ (60 ఏళ్ల వ్యక్తి)
వద్దనుండి సరుకులు రిసీవ్ చేసుకుని ఆమె లోపలికి వెళ్ళిపోయింది. కొన్ని సెకెన్లలోనే మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది. మహిళ అనుమానంగానే వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా మళ్ళీ డెలివరీ బాయ్ నిలబడి ఉన్నాడు. ఏదైనా ఇవ్వడం మరిచిపోయాడేమో అనుకుందామె. ‘దయచేసి ఏమీ అనుకోకుండా మీ వయసెంతో చెబుతారా’ అని అడిగాడు. నా వయసుతో ఇతనికేం పని అనుకుంటూనే… 33సంవత్సరాలని చెప్పింది.

ఆమె అలా చెప్పగానే సదరు డెలివరీ బాయ్ చటుక్కుని ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని ముద్దుపెట్టుకోబోయాడు. అయితే అతని తీరుపై అనుమానంగా ఉన్న ఆమె అంతకంటే వేగంగా తప్పించుకుంది. అంతే అతన్ని విడిపించుకుని వేగంగా లోపలికి వెళ్ళి ఢామ్మని తలుపు వేసుకుంది. ఇదంతా ఇంటి బయట ఏర్పాటు చేసిన సిసి కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ ఘటన షాక్ అయిన ఆమె కాసేపటికి తేరుకుని సదరు కంపెనీ వారిపై విరుచుకుపడింది. మహిళ ఫిర్యాదుకు స్పందించిన టెస్కో కస్టమర్ కు తమ డెలివరీ బాయ్ చర్యలకు క్షమాపణలు చెప్పింది. అంతేకాదు నిందితుడిని ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో పాటు డెలివరీ బాయ్‌పై అంతర్గత విచారణ కూడా ప్రారంభించారు. ఈ ఘటనపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆ వయసులో కూడా అతను పని చేసుకుంటూ జీవించడం మంచిదే.. కానీ ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే బతుకుదెరువు పోయి రోడ్డుమీద పడడం ఖాయమని ఈ ఘటనతో నిరూపించబడింది.