28మంది జనాభా ఉండే ఆ గ్రామంలో 8 ఏళ్ల తరువాత శిశు జననం: సంబరాల్లో మునిగిపోయిన గ్రామస్తులు

ఇటలీ దేశం మొత్తంలో అతి చిన్న గ్రామం. దాని పేరు మార్టిరోనీ. ఈ ఊరు పేరు మరోసారి వార్తల్లోకొచ్చింది. అదికూడా చాలా చాలా శుభవార్తతో. ఎందుకంటే ఆ ఊరి జనాభా 28 మంది మాత్రమే. ఏంటీ ఆశ్చర్యంగా ఉందా? ఉంటుంది మరి..అదే ఆగ్రామం ప్రత్యేకత. ఆ మార్టిరోనీలో ఎనిమిది సంవత్సరాల తరువాత ఎనిమిదేళ్ల తరువాత ఆ గ్రామంలో ఓ అద్భుతం జరిగింది. ఓ శిశువు జన్మించింది. దీంతో మార్టిరోనీ గ్రామంలో ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ప్రతీ ఒక్కరిలోనే సంతోషమే సంతోషం. ఆకాశమే హద్దుగా సంబరాలుచేసుకుంటున్నారు మార్టిరోనీ గ్రామస్తులు.
మార్టిరోనా గ్రామాన్ని మరోసారి వార్తల్లోకి తెచ్చి 2.6 కిలోల బరువుతో పుట్టిన ఆ బుజ్జాయి పేరు ‘డెన్నిస్’. అంత అద్భుతాన్ని తెచ్చిన ఆ బుజ్జాయి తల్లి పేరు శారా. తండ్రి పేరు మటాయో..తమకు మగబిడ్డ పుట్టాడని, గ్రామంలో కొత్త సభ్యుడు వచ్చాడని చెప్పేందుకు సంతోషంగా గ్రామస్తులు తమ ఇంటి తలుపుకు ఓ నీలి రంగు రిబ్బన్ తగిలించారు. అలా చేయడం ఇటీలీలో తరతరాలుగా వస్తున్న ఆచారం. అబ్బాయి పుడితే నీలి రిబ్బన్.. అమ్మాయి పుడితే లేత గులాబీ రంగు రిబ్బన్‌ను తలుపుకు తగిలిస్తారు.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సమయంలో తాను కడుపుతూ ఉండటం తనను కంగారు పెట్టిందని..ఆందోళనకు గురయ్యానని తల్లి శారా తెలిపింది. ఇన్ని సంవత్సరాల తరువాత తమ గ్రామంలో పుట్టే బిడ్డ పూర్తి ఆరోగ్యంతో ఉండాలని మేమంతా భావించాం. కానీ చక్కటి బిడ్డ పుట్టిందని బిడ్డను చూసి మురిసిపోతోంది ఆ తల్లి.
కాగా..29 మంది జనాభాతో ఉండే ఆ గ్రామంలో ఇటీవలే ఒక మరణం సంభవించడంతో అక్కడ జనాభా సంఖ్య 28 పడిపోయింది. కానీ తాజాగా డెన్నిస్ రాకతో మొత్తం సభ్యుల సంఖ్య మునుపటి స్థితికి చేరుకుందని గ్రామస్థులు సంబరపడిపోతున్నారు. ఆ బుజ్జాయి నవ్వులతో మార్టిరోనీ కొత్త కళను సంతరించుకుంది. వారి ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి.