Dawood Ibrahim: దావూద్‌పై విష ప్రయోగం జరిగితే.. బ్యాటింగ్ లెజెండ్ జావెద్ ఇంత హాట్ టాపిక్‌గా ఎందుకు మారాడో తెలుసా?
జావెద్‌కు, దావూద్‌కు సంబంధం ఏంటి? జావెద్‌కు కపిల్ దేవ్, గవాస్కర్ స్నేహితులే..

Dawood Ibrahim
Javed Miandad: భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకడైన దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగిందని ప్రచారం జరుగుతోన్న వేళ పాక్ ప్రభుత్వం అప్రమత్తమైంది. దావూద్ ఇబ్రహీం బంధువు, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ కుటుంబం మొత్తాన్ని పాక్ ఆర్మీ, ఐఎస్ఐ హౌస్ అరెస్ట్ చేసిందంటూ వార్తలు వస్తున్నాయి.
దీనిపై జావెద్ మియాందాద్ స్పందించారు. తనను హౌస్ అరెస్ట్ చేశారని వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. దావూద్ గురించి ఆయనను మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘దావూద్ గురించి వస్తున్న వార్తలపై నేను ఏమీ చెప్పను. ఆ వార్తలపై ఏం చెప్పాలనుకున్నా పాకిస్థాన్ ప్రభుత్వమే చెబుతుంది’ అని వ్యాఖ్యానించారు.
జావెద్‌కు, దావూద్‌కు సంబంధం ఏంటి?
దావూద్‌పై విష ప్రయోగం జరిగిందని ప్రచారం జరుగుతోన్న వేళ జావెద్ ఎందుకు హాట్ టాపిక్‌గా మారాడో తెలుసా? జావెద్ మియాందాద్ కుమారుడు జునైద్ అప్పట్లో దావూద్ కూతురు మహరుఖ్ ని పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలో ఇరు దేశాల సరిహద్దుల వద్ద ఉద్రిక్తత కూడా చోటు చేసుకుంది. భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ కూతురిని క్రికెటర్ కుమారుడు పెళ్లి చేసుకున్న విషయం భారతీయులకు ఆగ్రహం తెప్పించింది.
కపిల్ దేవ్, గవాస్కర్ స్నేహితులే..
జావెద్ 1996లో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడు తన కెరీర్ లో మొత్తం 124 టెస్టులు, 233 వన్డేలు, 402 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడాడు. టెస్టుల్లో 8,832, వన్డేల్లో 7,381 పరుగులు చేశాడు. భారత మాజీ ఆటగాళ్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ అప్పట్లో జావెద్ కు మంచి స్నేహితులు.
జావెద్ మియాందాద్ కుమారుడు అప్పట్లో దావూద్ కూతురిని వివాహం చేసుకున్నాడని వార్తలు రావడంతో భారతీయులు మండిపడ్డారు. దీంతో భారత మీడియా తన కుమారుడి వివాహంపై నిరాధార కథనాలు ప్రచురిస్తోందంటూ జావెద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దావూద్ కూతురు మహరుఖ్, జావెద్ కుమారుడు జునైద్ వివాహం 2005 ఆగస్టు 5న జరిగిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
Mallika Sagar : ఐపీఎల్ మినీ వేలం.. ఆక్షనీర్ మల్లికా సాగర్ ఎవరో తెలుసా..?