World Richest Family : 700 కార్లు.. రూ.4 వేల కోట్ల ప్యాలెస్.. 8 జెట్‌లు.. ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన కుటుంబం గురించి మీకు తెలుసా?

ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన రాజ కుటుంబం గురించి మీకు తెలుసా? వారి దగ్గర ఉన్న ఆస్తుల విలువ తెలిస్తే ఆశ్చర్యపోతారు.

World Richest Family : 700 కార్లు.. రూ.4 వేల కోట్ల ప్యాలెస్.. 8 జెట్‌లు.. ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన కుటుంబం గురించి మీకు తెలుసా?

World Richest Family

Updated On : January 19, 2024 / 4:05 PM IST

World Richest Family : UAE అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆస్తులు గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. బ్రిటీష్ రాజకుటుంబంతో పోల్చదగిన ఆస్తులు ఉన్న దుబాయ్ రాజకుటుంబం గురించి ఎన్నో ఆశ్చర్యపోయే విషయాలు ఉన్నాయి.

100 కోట్ల క్లబ్‌లోకి ‘హనుమాన్’.. అమెరికాలో, నార్త్‌లో దుమ్ము దులిపేస్తూ..

రూ.4,078 కోట్ల విలువ చేసే అధ్యక్ష భవనం, 8 ప్రైవేట్ జెట్‌లు, ప్రసిద్ధి చెందిన ఫుట్‌బాల్ క్లబ్ ఇంతే కాదు.. ఇంకా ఎన్నో ఆస్తులు కలిగి ఉన్న దుబాయ్‌లోని అల్ నహ్యాన్ రాజ కుటుంబం గురించి మీకు తెలుసా?  UAE అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కుటుంబం ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా నివేదికలు చెబుతున్నాయి. ఇక ఈ అధ్యక్షుడికి 18 మంది సోదరులు, 11 మంది సోదరీమణులు, ఎమిరాటి రాయల్‌కు చెందిన 9 మంది పిల్లలు, 18 మంది మనవరాళ్లు కూడా ఉన్నారు.

ఇంకా అల్ నహ్యాన్ రాజ కుటుంబానికి మాంచెస్టర్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్, ప్రపంచంలోని చమురు నిల్వలలో దాదాపు 6% వాటా కూడా ఉందట. ప్రముఖ గాయకుడు రిహన్న నుండి మొదలుపెడితే బ్యూటీ బ్రాండ్ ఫెంటీతో పాటు ఎలోన్ మస్క్ ట్విట్టర్ వరకు ప్రముఖ కంపెనీలలో వీరికి వాటా ఉందట. అబుదాబి పాలకుడి తమ్ముడు షేక్ హమద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్ వద్ద 5 బుగట్టి వేరాన్‌లు, ఒక లంబోర్ఘినీ రెవెంటన్ , మెర్సెడెస్-బెంజ్ CLK GTR, ఒక ఫెరారీ 599XX తో పాటు ప్రపంచంలోని అతి పెద్ద SVUతో పాటు 700 కి పైగా కార్లు ఉన్నాయట.

Mahesh Babu : మహేష్ జర్మనీకి సోలో ట్రిప్..? రాజమౌళి సినిమా కోసమా?

ఈ కుటుంబం కస్ర్ అల్-వతన్ అధ్యక్ష భవనంలో నివాసం ఉంటోంది. UAE లో వారికి ఉన్న ప్యాలెస్ లలో అది అతి పెద్దది. 94 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్యాలెస్ లో 3,50,000 స్ఫటికాలతో తయారు చేసిన షాన్డియర్ మరియు విలువైన చారిత్రక కళాఖండాలు ఉన్నాయి. అధ్యక్షుడి సోదరుడైన తహ్నౌన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రధాన పెట్టుబడి కంపెనీకి నాయకత్వం వహిస్తున్నారు. ఈ కంపెనీ వ్యవసాయం, ఇంధనం, వినోదం, సముద్ర వ్యాపారాలను కలిగి ఉండి దాదాపుగా 10 వేల మందికి ఉపాధి కలిగిస్తోందట. 2015లో న్యూయార్క్‌లోని కొన్ని నివేదికల ప్రకారం ఈ దుబాయ్ రాజకుటుంబాన్ని బ్రిటీష్ రాజకుటుంబంతో పోల్చారట. సింపుల్‌గా చెప్పడానికి ఇవి వారి ఆస్తులు. ఇవి కాకుండా మరెన్నో ఆస్తులు కలిగి ఉండి ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన కుటుంబంగా UAE అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కుటుంబం ప్రసిద్ధికెక్కింది.