100 కోట్ల క్లబ్‌లోకి ‘హనుమాన్’.. అమెరికాలో, నార్త్‌లో దుమ్ము దులిపేస్తూ..
హనుమాన్ సినిమా ఇప్పటికే 100 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించకపోయినా పలువురు సినిమా ట్రేడ్ ప్రముఖులు హనుమాన్ సినిమా కలెక్షన్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

Teja Sajja Hanuman Movie Enters 100 Crores Club Full Collections Details Here
Hanuman Collections : తేజ సజ్జ(Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ(Prashanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమా ఈ సంక్రాంతికి వచ్చి భారీ విజయం సాధిచింది. సినిమా రిలిజ్ రోజు ముందు ప్రీమియర్స్ నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. హనుమాన్ పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవ్వడంతో ఇండియా అంతా ఆదరణ లభిస్తుంది. ఇక కలెక్షన్స్ లో కూడా హనుమాన్ హవా చూపిస్తుంది. సినిమా రిలీజయి నాలుగు రోజులు దాటుతున్నా థియేటర్స్ ఇంకా హౌస్ ఫుల్ అవుతున్నాయి.
అయితే హనుమాన్ సినిమా ఇప్పటికే 100 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ దర్శకుడు ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. ఇది నా మొదటి సెంచరీ మూవీ అంటూ పేర్కొన్నారు. అలాగే 100 కోట్ల స్పెషల్ పోస్టర్ ని కూడా షేర్ చేశారు.
My first century in films ??? pic.twitter.com/VsiqdttRyR
— Prasanth Varma (@PrasanthVarma) January 16, 2024
హిందీలో హనుమాన్ సినిమా ఇప్పటికే 16 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక అమెరికాలో హనుమాన్ సినిమా ఇప్పటికే 3 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసినట్టు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. అంటే మన లెక్కల్లో దాదాపు 24 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఇక తెలుగులో హనుమాన్ సినిమా ఇప్పటికే 50 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు సమాచారం. మిగిలిన సౌత్ రాష్ట్రాల్లో కలిపి హనుమాన్ సినిమా మొత్తంగా దాదాపు 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పటికే అన్ని ఏరియాల్లో హనుమాన్ సినిమా బ్రేక్ ఈవెన్ అయి ఫుల్ ప్రాఫిట్స్ లో ఉంది.
#Hanuman takes FULL advantage of festival day as family audience flock in huge numbers.#HanumanHits100cr
The film flies past ₹? cr club in just 4 days at the WW Box Office.
Day 1 – ₹ 21.35 cr
Day 2 – ₹ 29.72 cr… pic.twitter.com/6qr7eZKqxR— Manobala Vijayabalan (@ManobalaV) January 16, 2024
Also Read : భీమవరంలో ప్రభాస్ ‘రాజాసాబ్’ డిజిటల్ లాంచ్ వీడియో చూశారా?
ఇంకా 18వ తేదీ వరకు సంక్రాంతి హాలీడేస్ ఉండటం, కొన్ని చోట్ల థియేటర్లు యాడ్ చేయడం, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడంతో హనుమాన్ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. అమెరికాలో కూడా ఇంకా కలెక్షన్స్ పెరిగి పలు రికార్డులని సెట్ చేయబోతుంది. ఇప్పటికే అమెరికాలో టాప్ 10 తెలుగు సినిమాల కలెక్షన్స్ లిస్ట్ చేరింది హనుమాన్. హిందీలో కూడా జనవరి 25 వరకు వేరే సినిమాలేవీ లేకపోవడంతో అక్కడ కూడా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి హనుమాన్ ఇండియాతో పాటు అమెరికాలో కూడా దుమ్ము దులిపేస్తుంది. త్వరలోనే జపాన్, చైనా, స్పానిష్..పలు చోట్ల రిలీజ్ చేయనున్నారు ఈ సినిమాని.
It’s #HanuMania everywhere: from North to South, from East to West… #HanuMan is UNSTOPPABLE and UNSHAKABLE… Continues its victory march on make-or-break Day 4 [Mon]… Collects *more* than Day 1 [Fri], despite reduced ticket rates *on weekdays*… This one’s NOT going to slow… pic.twitter.com/IGjpcEzCWT
— taran adarsh (@taran_adarsh) January 16, 2024
#HANUMAN is creating a Euphoria that’ll be remembered for ages ?
The sensational film breaches $3 MILLION+ in USA & enters the chart of TOP10 all-time Grosses from Telugu Cinema ???#HanuManRAMpage
A @PrasanthVarma Film
?ing @tejasajja123Overseas Release by… pic.twitter.com/BJe4QDInsC
— Primeshow Entertainment (@Primeshowtweets) January 16, 2024