Donald Trump: ట్విటర్‌లోకి డొనాల్డ్ ట్రంప్ రీ ఎంట్రీ.. పోస్టు పెట్టిన రెండు గంటల్లోనే ఎంతమంది వీక్షించారో తెలుసా?

కొన్నేళ్లుగా డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. 2020 నవంబరులో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను వ్యతిరేకిస్తూ ట్రంప్ మద్దతుదారులు

Donald Trump: ట్విటర్‌లోకి డొనాల్డ్ ట్రంప్ రీ ఎంట్రీ.. పోస్టు పెట్టిన రెండు గంటల్లోనే ఎంతమంది వీక్షించారో తెలుసా?

Donald Trump

Donald Trump Twitter: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం జార్జియా అధికారుల ముందు లొంగిపోయిన విషయం తెలిసిందే. అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో జోక్యంచేసుకున్న కేసులో ట్రంప్ ను 22 నిమిషాల పాటు పుల్టన్ కౌంటీ జైలులో ఉంచారు. అంతకుముందు పోలీసు రికార్డులకోసం ఆయన ఫొటో (మగ్‌షాట్) తీశారు. దీంతో చరిత్రలో మగ్‌షాట్ తీయించుకున్న తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ రికార్డుకెక్కాడు. మగ్‌షాట్ డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ ఖాతాలో ఫోస్టు చేశాడు. 2021 జనవరి 8వ తేదీ తరువాత ట్విటర్‌లో డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ ఇదేకావటం గమనార్హం. ‘మగ్ షాట్ 2023 ఆగస్ట్ 24’ పేరుతో ట్రంప్ కామెంట్ కూడా పెట్టాడు. ఎన్నికల జోక్యం.. లొంగేది లేదు అనే క్యాప్షన్ పెట్టారు. డొనాల్డ్ ట్రంప్ డాట్ కామ్ పేరుతో తన వెబ్ సైట్ చిరునామాను కూడా అక్కడ ట్రంప్ రాశారు.

Donald Trump : పోల్ రాకెటింగ్ కేసులో డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్, బాండ్‌పై విడుదల

కొన్నేళ్లుగా డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. 2020 నవంబరులో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను వ్యతిరేకిస్తూ ట్రంప్ మద్దతుదారులు 2021 జనవరి 6న క్యాపిటల్ హిల్ భవనంపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత ట్రంప్ ట్విటర్ ఖాతాను శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లు ట్విటర్ ప్రకటించింది. ట్రంప్ ట్వీట్లు విద్వేషాలు రెచ్చగొట్టేవిలా ఉన్నాయని, మరింత హింస జరగకుండా ఉండేందుకే ట్రంప్ ట్విటర్ ఖాతాను రద్దు చేసినట్లు అప్పటి ట్విటర్‌లో న్యాయ నిపుణురాలైన భారతీయ అమెరికన్ విజయ గద్దె తెలిపారు.

Donald Trump : అందరి బిల్లు నేనే చెల్లిస్తానని చెప్పి హోటల్ బిల్లు కట్టకుండా ఎస్కేప్ అయిన ట్రంప్.!

ట్విటర్ ఎలాన్ మస్క్ చేతుల్లోకి వచ్చిన తరువాత డొనాల్డ్ ట్రంప్ ఖాతాను పునరుద్దరించాలా? వద్దా? అని మస్క్ పోల్ నిర్వహించారు. వీరిలో 51.18 శాతం ట్రంప్ ఖాతా పునరుద్దరణకు అనుకూలంగా ఓటువేశారు. దీంతో 2022 నవంబర్ నెలలో ట్రంప్ ట్విటర్ అధికారిక ఖాతాను పునరుద్దరించారు. కానీ, ట్రంప్ ట్వీటర్‌లోకి వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. తాజాగా .. దాదాపు రెండున్నరేళ్ల తరువాత ట్విటర్‌లో తన అధికారిక ఖాతాలో ట్రంప్ పోస్టు పెట్టాడు. ట్రంప్ పోస్టు చేసిన రెండు గంటల్లోనే 4.2కోట్ల మంది వీక్షించారు. రెండు లక్షల మంది రీ ట్వీట్ చేశారు.