Donald Trump : జో బిడెన్ స్టేజీ పైనుంచి ఎలా దిగుతాడో యాక్ట్ చేసి చూపించిన డొనాల్డ్ ట్రంప్.. వీడియో వైరల్
సోమవారం న్యూ హాంప్ షైర్ లోని డెర్రీలో ఓ కార్యక్రమంలో డొనాల్డ్ ట్రంప్ పాల్గొని ప్రసంగించారు. పలు విషయాలపై ప్రస్తావించారు. ఈ సందర్భంగా అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ వేదికపై ప్రసంగం అనంతరం

Donald Trump
Donald Trump – Joe Biden : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూటే సెపరేటు. ట్రంప్ తరచూ ఏదోఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటాడు. వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీకి ట్రంప్ సిద్ధమవుతున్నారు. అయితే, ప్రస్తుతం ట్రంప్ న్యాయపరమైన వివాదాలను ఎదుర్కొంటున్నారు. తాజాగా ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ వేదికపై ప్రసంగం అనంతరం కిందికి దిగేటప్పుడు ఎలా నడుస్తాడో అనుకరిస్తూ ఎగతాళి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సోమవారం న్యూ హాంప్ షైర్ లోని డెర్రీలో ఓ కార్యక్రమంలో డొనాల్డ్ ట్రంప్ పాల్గొని ప్రసంగించారు. పలు విషయాలపై ప్రస్తావించారు. ఈ సందర్భంగా అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ వేదికపై ప్రసంగం అనంతరం కిందికి ఎలా దిగుతాడో ట్రంప్ అనుకరణ చేసి చూపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ట్రంప్ అనుకరణ ప్రకారం.. బిడెన్ వేదికపై నుంచి దిగే సమయంలో తన దారిని కనుగొనలేకపోయాడు.. అతను మెట్లను గుర్తించలేనట్లు నటిస్తూ బిడెన్ చర్యలను ట్రంప్ అనుకరిస్తూ చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలాఉంటే రెండురోజుల క్రితం ట్రంప్ వ్యక్తిగత విషయానికి సంబంధించి ఆడియో లీకైన విషయం తెలిసిందే. ఈ ఆడియోలో ట్రంప్ తన భార్య మెలానియా ట్రంప్ ను బికినీ వేసుకుని ప్లోరిడాలోని మార్ ఎ లాగో నివాసం చుట్టూ తిరిగితే కుర్రాళ్లందరూ తాము ఏం కోల్పోయామో తెలుసుకుంటారని చెప్పినట్లు ఆస్ట్రేలియా బిలియనిర్ ఆంథోని ప్రాట్ ఆడియో ఒకటి బయటకు వచ్చింది. ట్రంప్, ఆంథోని ప్రాట్ కు 2020 ఎన్నికల సమయంలో పరిచయం. వారి పరిచయం స్నేహంగా మారింది. ఈ ఆడియో వ్యవహారాన్ని ట్రంప్ ప్రతినిధి ఖండించారు. ఇది కేవలం కల్పితమేనని మండిపడ్డారు.
https://twitter.com/realDonParody/status/1716546490288529551