Trump Tariff : సుంకాలపై ట్రంప్ సంచలన నిర్ణయం.. 90 రోజుల పాటు నిలుపుదల.. చైనాకు బిగ్ షాక్..
70 దేశాలపై అమెరికా ప్రతీకార సుంకాలు విధించిన సంగతి తెలిసిందే.

Donald Trump
Trump Tariff : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను విధించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. చైనాకు మాత్రం ఇది వర్తించదని తేల్చి చెప్పారు. 70 దేశాలపై అమెరికా ప్రతీకార సుంకాలు విధించిన సంగతి తెలిసిందే.
ఇది ఇలా ఉంటే అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ ముదురింది. ఒక్కరోజు తేడాలోనే చైనాపై అమెరికా మరోసారి సుంకాలు పెంచింది. 104 నుంచి 125 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. చైనా వస్తువులపై ఈ ఉదయమే 104 శాతం అమెరికా సుంకాలు విధించింది. చైనా కూడా తగ్గేదేలే అంటోంది. ప్రతీకారంగా అమెరికా వస్తువులపై 84 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. దీంతో మరోసారి డ్రాగన్‌పై సుంకాలు 125శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు. చైనా ప్రపంచ మార్కెట్లను అగౌరవపరిచిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ వివరించారు.
Also Read : ట్రంప్ మరో దెబ్బ..! ఈసారి ఫార్మా రంగంపై టారిఫ్‌లు..? హైదరాబాద్ కంపెనీలపై భారీ ఇంపాక్ట్..?
“ప్రపంచ మార్కెట్ల పట్ల చైనా గౌరవం చూపకపోవడం ఆధారంగా, అమెరికా చైనాపై విధించే సుంకాన్ని వెంటనే అమల్లోకి వచ్చేలా 125%కి పెంచుతున్నాను. ఏదో ఒక సమయంలో సమీప భవిష్యత్తులో అమెరికా, ఇతర దేశాలను దోచుకునే రోజులు ఇకపై స్థిరమైనవి లేదా ఆమోదయోగ్యం కాదని చైనా గ్రహిస్తుందని ఆశిస్తున్నాను.
దీనికి విరుద్ధంగా, 75 కంటే ఎక్కువ దేశాలు వాణిజ్యం, ట్రెజరీ USTR విభాగాలతో సహా యునైటెడ్ స్టేట్స్ ప్రతినిధులను వాణిజ్యం, వాణిజ్య అడ్డంకులు, సుంకాలు, కరెన్సీ మానిప్యులేషన్ ద్రవ్యేతర సుంకాలకు సంబంధించి చర్చించబడుతున్న అంశాలకు పరిష్కారం కోసం చర్చలు జరపడానికి పిలిచాయి.
Also Read : ట్రంప్ 104% టారిఫ్‌పై చైనా ప్రతిస్పందన.. సుంకాలు ఎంతగా పెంచేసిందంటే? టారిఫ్‌లతో ఫుట్‌బాల్ ఆడుతున్నట్లు..
ఈ దేశాలు నా బలమైన సూచన మేరకు, యునైటెడ్ స్టేట్స్‌కు వ్యతిరేకంగా ఏ విధంగానూ, ఏ రూపంలోనూ ప్రతీకారం తీర్చుకోలేదు. ఈ కాలంలో 90 రోజుల విరామం, గణనీయంగా తగ్గించబడిన పరస్పర సుంకాన్ని అనుమతించాను” అని ట్రంప్ ప్రకటించారు.