Donald Trump: అలాంటి దేశాలతో వ్యాపారం చేయం.. డొనాల్డ్ ట్రంప్ సీరియస్ వార్నింగ్

అమెరికా అధ్యక్షుడిగా మరికొద్దిరోజుల్లో బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ ను టైమ్ మ్యాగజైన్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఆ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Donald Trump: అలాంటి దేశాలతో వ్యాపారం చేయం.. డొనాల్డ్ ట్రంప్ సీరియస్ వార్నింగ్

Donald Trump

Updated On : December 13, 2024 / 10:22 AM IST

Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన వచ్చే ఏడాది జనవరి 20న అమెరికాకు అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికే తన కార్యవర్గాన్ని నియమించుకుంటున్న ట్రంప్.. ప్రపంచ దేశాల పట్ల తన వైఖరిని వెల్లడిస్తున్నాడు. ముఖ్యంగా అమెరికాకు అక్రమంగా వలసలు వచ్చే దేశాలపై ట్రంప్ గుర్రుగా ఉన్నాడు. ఎన్నికల ప్రచార సమయంలోనూ అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమేస్తామని ట్రంప్ స్పష్టం చేశాడు. తాను అధ్యక్షుడిని అయితే దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆపరేషన్ చేపట్టి కనీసం 10లక్షల మందికిపైగా అక్రమ వలసదారులను వెనక్కు పంపించడం ఖాయమని ట్రంప్ ఎన్నికల ప్రచారం ప్రకటించారు. ప్రస్తుతం ఆయన విజయం సాధించడంతో అక్రమ వలసదారులను వారివారి దేశాలకు పంపించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Also Read: Haiti gang: హైతీలో184 మందిని హతమార్చిన గ్యాంగ్‌స్టర్.. అందరూ వృద్ధులే.. ఎందుకంటే?

అమెరికా అధ్యక్షుడిగా మరికొద్దిరోజుల్లో బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ ను టైమ్ మ్యాగజైన్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఆ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అక్రమ వలసలపై ఘాటుగా స్పందించాడు. వలసదారులను వెనక్కి తీసుకెళ్లని దేశాలతో తాను వ్యాపారం చేయబోనని ట్రంప్ పేర్కొన్నాడు. గతంలో ఎన్నడూ చూడని విధంగా దేశంలోకి వలసదారులు వస్తున్నారు. వీరిపై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడబోను అని మరోసారి ట్రంప్ స్పష్టం చేశాడు. అమెరికాలోకి అక్రమంగా వలస వచ్చేవారిని తిరిగి వారి దేశానికి పంపిస్తా.. వలసల కట్టడిపై చర్యలు తీసుకోని దేశాలతో వ్యాపార సంబంధాలు కొనసాగించలేము అంటూ ట్రంప్ పేర్కొన్నారు.

 

ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ.. నేను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచే పుట్టకతో సంక్రమించే పౌరసత్వం అంశంపై దృష్టి సారిస్తానని చెప్పారు. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణలో పొందుపర్చిన ‘జన్మహక్కు పౌరసత్వం’ (birthright citizenship)ను రద్దు చేయాలని యోచిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఆ నిర్ణయం అమల్లోకి వస్తే చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా యూఎస్ లో తల్లిదండ్రులకు జన్మించిన వారికి అమెరికా పౌరసత్వం లభించదు.