Donald Trump Truth Social: గూగుల్ ప్లే‌స్టోర్‌ లోకి డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ యాప్ .. అనుమతిచ్చిన గూగుల్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ట్రూత్ సోషల్ యాప్‌’ను గూగుల్ తన ప్లే స్టోర్‌లో ఆండ్రాయిడ్ ఫోన్‌లలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి బుధవారం ఆమోదించింది. గూగుల్ తన నిబంధనలకు అనుగుణంగా యాప్‌ను మార్పు చేసిన తరువాత ఆ మేరకు నిర్ధారించుకొని ఈ నిర్ణయం తీసుకుంది.

Donald Trump Truth Social: గూగుల్ ప్లే‌స్టోర్‌ లోకి డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ యాప్ .. అనుమతిచ్చిన గూగుల్

Donald Trump's Truth Social

Updated On : October 13, 2022 / 10:29 AM IST

Donald Trump Truth Social: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ట్రూత్ సోషల్ యాప్‌’ను గూగుల్ తన ప్లే స్టోర్‌లో ఆండ్రాయిడ్ ఫోన్‌లలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి బుధవారం ఆమోదించింది. గూగుల్ తన నిబంధనలకు అనుగుణంగా యాప్‌ను మార్పు చేసిన తరువాత ఆ మేరకు నిర్ధారించుకొని ఈ నిర్ణయం తీసుకుంది.

Donald Trump: సీఎన్‌ఎన్‌ నెట్‌వర్క్‌పై పరువునష్టం దావా వేసిన డొనాల్డ్ ట్రంప్

గూగుల్ ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో ట్రూత్ సోషల్ యాప్‍లో హింసాత్మక పోస్టులు, అభ్యంతరకర వ్యాఖ్యలతో కూడిన పోస్టులను తొలగించే, మార్పులుచేసే వీలు లేకుండా ఉండేదని, దీనివల్ల యాప్‌ను గూగుల్ స్టోర్ నుండి తొలగించడం జరిగిందని తెలిపారు. తాజాగా.. గూగుల్ నిబంధనల ప్రకారం.. అభ్యంతరకరమైన పోస్ట్‌లను నిషేధించే విధానాలకు అనుగుణంగా ట్రూత్ సోషల్ అప్‌డేట్ చేయబడింది. అంతేకాక అభ్యంతరకర కంటెంట్‌ను నివేదించడానికి, తీసివేయడానికి, స్వేచ్ఛాహక్కును దుర్వినియోగం చేసేవారిని నిరోధించడానికి సమర్థవంతమైన సిస్టమ్‌లను ఈ యాప్ లో అందుబాటులో ఉంచడం జరిగిందని, దీని కారణంగా గూగుల్ ప్లే స్టోర్ లో దీనిని అనుమతించడం జరిగిందని తెలిపారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ ప్రతినిధులు ఈ విషయంపై మాట్లాడుతూ.. గూగుల్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని, చివరకు అమెరికన్లందరికీ ట్రూత్ సోషల్‌ను అందించడంలో మాకు సహాయపడినందుకు మేము సంతోషిస్తున్నామని అన్నారు. ఇదిలాఉంటే యూఎస్ క్యాపిటల్ వద్ద జరిగిన అల్లర్ల తర్వాత తన ‘ప్రేరేపిత ట్వీట్ల’పై జనవరిలో ట్విట్టర్ నుండి శాశ్వత సస్పెన్షన్‌కు గురైన ట్రంప్ ప్రతిస్పందనగా అక్టోబర్ 2021లో ట్రూత్ సోషల్ యాప్ ను అందుబాటులోకి తెస్తానని ప్రకటించారు. ట్రంప్ తెలిపిన విధంగా.. ఫిబ్రవరి 2022లో ఈ ట్రూత్ సోషల్ యాప్ ను ప్రారంభించారు.