ఆఫ్రిది ఫౌండేషన్ కు సాయంపై కామెంట్స్ : విమర్శకులపై యువరాజ్ ఆగ్రహం

కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. భారత్ తోపాటు పాకిస్తాన్ లో కరోనా విజృంభిస్తుండటంతో ప్రజలు విలవిలలాడుతున్నారు.

  • Published By: veegamteam ,Published On : April 1, 2020 / 08:00 PM IST
ఆఫ్రిది ఫౌండేషన్ కు సాయంపై కామెంట్స్ : విమర్శకులపై యువరాజ్ ఆగ్రహం

Updated On : April 1, 2020 / 8:00 PM IST

కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. భారత్ తోపాటు పాకిస్తాన్ లో కరోనా విజృంభిస్తుండటంతో ప్రజలు విలవిలలాడుతున్నారు.

కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. భారత్ తోపాటు పాకిస్తాన్ లో కరోనా విజృంభిస్తుండటంతో ప్రజలు విలవిలలాడుతున్నారు. ఈ నేపథ్యంలో అపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న వారికి తన ఫౌండేషన్ ద్వారా సాయం చేయాలని పాకిస్తాన్ క్రికెట్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది భావించాడు. ఇందులో భాగంగా ఫౌండేషన్ ద్వారా ఆహారం, మందులు అందిస్తున్నాడు. 

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఇది చాలా కఠినమైన సమయమని టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, హర్బజన్ సింగ్ అన్నారు. పేదల కష్టాలు వర్ణణాతీతం అన్నారు. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేద్దామని అన్నారు. అఫ్రిదీ ఫౌండేషన్ కు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. కరోనాపై పోరులో ఆఫ్రిది ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఫౌండేషన్ కు విరాళాలు ఇవ్వాలని పిలుపు ఇచ్చారు. 

తనకు మద్దతు తెలిపిన యువరాజ్, హర్బజన్ లకు ట్విట్టర్ లో ఆఫ్రిది ధన్యవాదాలు తెలిపారు. మీ మద్దతు వెలకట్టలేనిదన్నారు. మన మధ్య ఉన్న మధ్య ఉన్న ఈ బంధం మానవత్వం, ప్రేమ, శాంతికి సరిహద్దులు ఉండవని ప్రపంచానికి తెలుపుతుందన్నారు. యువరాజ్ ఫౌండేషన్ యూవీకెన్ కు అభినందనలు తెలిపాడు.

అయితే ఆఫ్రిది ఫౌండేషన్ కు విరాళాలు ఇవ్వాలని పిలుపివ్వడంపై కొంతమంది సోషల్ మీడియా వేదికగా యువరాజ్ సింగ్ ను ట్రోల్ చేశారు. అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ లో సమస్య వచ్చినప్పుడు పాకిస్తాన్ క్రికెటర్లు స్పందించే తీరు మర్చిపోయావా అంటూ ప్రశ్నించారు. 

సోషల్ మీడియాలో తనపై విమర్శలు చేసిన వారిపై యువరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవత్వానికి సరిహద్దులంటూ ఉండవని ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చాడు. మనకు హాని చేసిన వారు కూడా సాయం కోరితే ఆలోచించకుండా సాయం చేయాలనే కనీస ధర్మాన్ని కొందరు ఎందుకు వదిలేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.

అన్ని దేశాలలోని ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదన్నారు. తాను భారతీయుడినని, తన రక్తం కూడా ఎప్పటికీ నీలమేనని అన్నారు. ఎల్లప్పుడూ మానవత్వం కోసం నిలబడతాను. జైహింద్ అంటూ యువరాజ్ సింగ్ ట్వీట్ చేశారు. 

Also Read | ఏపీలో 111కు పెరిగిన కరోనా కేసులు..ఒక్కరోజే 67 మందికి పాజిటివ్