Congo Fever: ఇరాక్‌ను వణికిస్తున్న కొత్త వైరస్.. మరణాల రేటు ఎక్కువే

కొవిడ్ వ్యాప్తి అనంతరం కొత్త వైరస్‌లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ పలు వేరియంట్ల రూపంలో పలు దేశాల్లో విజృంభిస్తూనే ఉంది. చైనా, ఉత్తర కొరియా, దక్షిణాఫ్రియా వంటి దేశాల్లో కొత్త వేరియంట్ల రూపంలో కొవిడ్ వ్యాప్తి తీవ్రంగానే ఉంది. భారత్‌లో ...

Congo Fever: ఇరాక్‌ను వణికిస్తున్న కొత్త వైరస్.. మరణాల రేటు ఎక్కువే

Congo Fever

Updated On : May 30, 2022 / 7:43 AM IST

Congo Fever: కొవిడ్ వ్యాప్తి అనంతరం కొత్త వైరస్‌లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ పలు వేరియంట్ల రూపంలో పలు దేశాల్లో విజృంభిస్తూనే ఉంది. చైనా, ఉత్తర కొరియా, దక్షిణాఫ్రియా వంటి దేశాల్లో కొత్త వేరియంట్ల రూపంలో కొవిడ్ వ్యాప్తి తీవ్రంగానే ఉంది. భారత్‌లో కొవిడ్ వైరస్ అదుపులోనే ఉన్నప్పటికీ నిర్లక్ష్యం వహిస్తే పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిస్తుంది. ఇదిలా ఉంటే ఇరాక్‌లో కొత్త వైరస్ వ్యాప్తితో ఆ దేశ ప్రజలు వణికిపోతున్నారు. ఆఫ్రికా, ఆసియా, మధ్యతూర్పు ప్రాంతాల్లో ఎక్కువగానే కనిపించే కాంగో ఫీవర్ వైరస్ ఇరాక్ ప్రజలను అల్లకల్లోలం చేస్తోంది. ఈ వైరస్ సోకితే రోగికి ముక్కు నుంచి రక్తం కారడంతో పాటు అధిక రక్తస్రావం కావడంతో మృతిచెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Tomota Fever : కేరళను కలవర పెడుతున్న టమోటా ఫీవర్

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇరాక్‌లో ఇప్పటికే ఈ వైరస్ వ్యాప్తి కారణంగా 19మంది మృతిచెందారు. ఒకరి నుంచి ఒకరికి ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. ఈ వైరస్ నిర్వీర్యంకు ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. జంతువుల నుంచి ఈ వైరస్ మానవులకు వ్యాపిస్తోంది. ఇరాక్ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రజలు ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఆవుపై పురుగుల మందు పిచికారీ చేస్తుండగా ఓ ఆరోగ్య కార్యకర్త ఈ ఇన్ఫెక్షన్‌కు గురయ్యాడు. ఈ సంఘటన తర్వాత ఇరాక్‌లోని గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య కార్యకర్తలు పీపీఈ కిట్లు ధరించి పనిచేస్తున్నారు నైరో వైరస్ అని పిలిచే క్రిమియన్ – కాంగో హెమోరేజిక్ అనే పేలు ద్వారా జంతువుల్లో ఈ వైరస్ వ్యాప్తి జరుగుతుంది. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెల్లో ఈ వైరస్ వాహకంగా ఈ పేలు పనిచేస్తుంది. వైరస్ బారిన పడిన పశువుల రక్తాన్ని తాకినప్పుడు, పశువధ కేంద్రాల్లోని స్త్రావాల ద్వారా మానవులకు ఈ వైరస్ సోకుతుంది. ఈ వైరస్ సోకిన వ్యక్తుల రక్తం, మలం, చెమట కణాల ద్వారా ఇతర వ్యక్తులకు వ్యాపిస్తోంది.

Fever : పిల్లలకు జ్వరమే కదా అని లైట్ తీసుకోకండి.. ఎందుకంటే?

ఈ వైరస్ సోకితే తలనొప్పి, వాంతులు, విరేచనాలు, తీవ్ర జ్వరంతో పాటు ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం జరిగి చివరకు ప్రాణాలు కాల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వైరస్ సోకిన ఐదు కేసుల్లో ఇద్దరు మృత్యువాత పడుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ధీకర్ ప్రావిన్స్‌లోని ఆరోగ్య అధికారి హైదర్ హంటూచె మాట్లాడుతూ. దక్షిణ ఇరాక్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయదారుల్లో ఈ కొత్త వైరస్ కేసులు నమోదువుతున్నాయని అన్నారు. గతంలో ఈ వైరస్ ఆనవాళ్లు ఉన్నప్పటికీ పెద్దగా వ్యాప్తి జరిగేది కాదని, ఇప్పుడు ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోందని హైదర్ హంటూచె అన్నారు.