Abu Dhabi : అబుదాబి ఉగ్రదాడిలో ముగ్గురు మృతి..అందులో ఇద్దరు ఇండియన్స్ ?

పారిశ్రామిక ప్రాంతంగ పేరొందిన ముసఫాలో ADNOC సంస్థకు చెందిన చమురు నిల్వలున్నాయి. రెండు ప్రదేశాల్లో డ్రోన్లతో దాడులకు పాల్పడ్డారని గుర్తించారు...

Abu Dhabi : అబుదాబి ఉగ్రదాడిలో ముగ్గురు మృతి..అందులో ఇద్దరు ఇండియన్స్ ?

Drone

Updated On : January 17, 2022 / 5:51 PM IST

Drone Attack Abu Dhabi : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో ఉగ్రవాదులు జరిపిన ఉగ్రదాడి తీవ్ర కలకలం రేపింది. ఈ దాడులకు డ్రోన్లను ఉపయోగించడం విశేషం. మూడు డ్రోన్లు ఉపయోగించి…దాడికి పాల్పడడంతో మూడు ఆయిల్ ట్యాంకర్లు పేలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. అంతేగాకుండా..ముగ్గురు చనిపోయారు. మృతుల్లో ఇద్దరు భారతీయులున్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో మరో ఆరుగురికి గాయాలయ్యాయి.

Read More : CM Jagan : ప్రికాషన్ డోస్ వ్యవధి తగ్గించండి.. కేంద్రానికి సీఎం జగన్ విజ్ఞప్తి

పారిశ్రామిక ప్రాంతంగ పేరొందిన ముసఫాలో ADNOC సంస్థకు చెందిన చమురు నిల్వలున్నాయి. రెండు ప్రదేశాల్లో డ్రోన్లతో దాడులకు పాల్పడ్డారని గుర్తించారు. ఘటనా స్థలానికి సమీపంలో డ్రోన్లకు సంబంధించి భాగాలు అక్కడి అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. డ్రోన్ దాడులకు తామే పాల్పడ్డామని ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ ఉగ్రవాదులు ఓ ప్రకటనలో వెల్లడించారు. సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనా ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు.