Iraq : ప్రధాని నివాసంపై డ్రోన్ దాడి

ఆదివారం తెల్లవారుజామున బాగ్దాద్‌లోని ఇరాక్ ప్రధాని ముస్తఫా అల్-కదిమి నివాసంపై డ్రోన్ దాడి జరిగింది.

Iraq : ప్రధాని నివాసంపై డ్రోన్ దాడి

Iraq

Updated On : November 7, 2021 / 10:16 AM IST

Iraq :  ఆదివారం తెల్లవారుజామున బాగ్దాద్‌లోని ఇరాక్ ప్రధాని ముస్తఫా అల్-కదిమి నివాసాన్ని లక్ష్యంగా డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడి నుంచి ప్రధాని కమిది సురక్షితంగా బయటపడ్డారని అధికారవర్గాలు వెల్లడించాయి. గ్రీన్ జోన్ లో ప్రధాని నివాసాన్ని టార్గెట్ గా చేసుకొని ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఇక పేలుడుపై ప్రధాని కదిరి అధికార ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు.

చదవండి : Iraq : బాంబులతో దద్దరిల్లిన ఇరాక్.. విమానాశ్రయంపై డ్రోన్లతో దాడి

తనకు ఎటువంటి గాయాలు కాలేదని ప్రజలు ప్రశాంతంగా ఉండాలని సూచించారు. ఇక ఈ దాడిలో ఏడుగురు భద్రతా సిబ్బందికి గాయాలు అయినట్లు సమాచారం. ఈ దాడికి తామే బాద్యులమని ఇప్పటివరకు ఏ గ్రూప్ చెప్పలేదు. ప్రభుత్వ భవనాలు, విదేశీ రాయబార కార్యాలయాలు ఉన్న గ్రీన్ జోన్‌లో దౌత్యవేత్తలు ఈ ప్రాంతంలో పేలుళ్ల శబ్దాలు విన్నారని చెప్పారు.

చదవండి : Long Range Bomb : భారత్ మరో ఘనత..లాంగ్ రేంజ్ బాంబ్ ప్రయోగం విజయవంతం

కాగా ఇరాక్ లో కూటమిగా ఏర్పడిన సాయుధ బలగాలు అక్కడి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు చేస్తున్నాయి. తాజాగా గ్రీన్ జోన్ లోని పార్లమెంట్ భవనం సమీపంలో సాయుధులైన తిరుగుబాటు దారులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అయితే ఈ దాడి వారే చేసి ఉంటారని ఇరాక్ రక్షణ శాఖ వర్గాలు భావిస్తున్నాయి.